Ysrcp list: వైసీపీ తొమ్మిదో జాబితా విడుదల.. ముగ్గురు ఇంచార్జిలతో లిస్టు
మూడు నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించింది. నెల్లూరు పార్లమెంటరీ స్థానం ఇంచార్జిగా విజయసాయిరెడ్డిని నియమించగా, కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్‌ను, మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్యను నియమించింది.

Ysrcp list: రాబోయే ఎన్నికలకు వైసీపీ.. వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తల్ని నియమిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎనిమిది జాబితాలు విడుదల చేసిన వైసీపీ.. శుక్రవారం సాయంత్రం తొమ్మిదో జాబితా విడుదల చేసింది. మూడు నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించింది.
TS Inter Exams 2024: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధనలో మార్పు..
నెల్లూరు పార్లమెంటరీ స్థానం ఇంచార్జిగా విజయసాయిరెడ్డిని నియమించగా, కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్‌ను, మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్యను నియమించింది. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.. ఇప్పుడు ఆ స్థానంలో లావణ్యను నియమించింది వైసీపీ. వీరిలో ఇంతియాజ్ ఇటీవలే ఐఏఎస్‌కు రాజీనామా చేసి, వైసీపీలో చేరారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జాబితా విడుదల చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.