YS JAGAN: మరో నలుగురు నియోజకవర్గాల ఇంచార్జిల నియామకం.. సిట్టింగ్‌లకు నో ఛాన్స్

జగ్గంపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉనన జ్యోతుల చంటిబాబుకి షాకిచ్చారు సీఎం జగన్. ఆ నియోజకవర్గానికి తోట నర్సింహాన్ని ఇన్‌చార్జ్‌గా నియమించారు. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను పిఠాపురం నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా నియమించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2023 | 08:45 PMLast Updated on: Dec 18, 2023 | 8:45 PM

Ys Jagan Announced Inchagres Of Assembly Constituencies

YS JAGAN: ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై సీఎం, వైసీపీ అధినేత జగన్ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. ఇప్పటినుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా వివిధ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమిస్తున్నారు. ఇటీవలే 11 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను ప్రకటించిన జగన్, సోమవారం మరో నలుగురిని ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. జగ్గంపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉనన జ్యోతుల చంటిబాబుకి షాకిచ్చారు సీఎం జగన్.

T CONGRESS: 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ఇంచార్జిల నియామకం..

ఆ నియోజకవర్గానికి తోట నర్సింహాన్ని ఇన్‌చార్జ్‌గా నియమించారు. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను పిఠాపురం నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా నియమించారు. ప్రస్తుతం పిఠాపురంలో పెండెం దొరబాబు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను కాదని వంగా గీతకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. వంగా గీత ఈసారి పార్లమెంట్ కాకుండా.. అసెంబ్లీకి పోటీ చేయాలని భావించడం వల్ల జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ నియోజకవర్గాన్ని మార్చారు. ఈసారి వేణు గోపాల కృష్ణను రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారు. అందుకే ఆయనకు రాజమండ్రి రూరల్ ఇన్‌చార్జ్‌గా నియమించారు.

ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. రామచంద్రాపురం నుంచి వేణు గోపాల కృష్ణ వేరే నియోజకవర్గానికి వెళ్లడంతో అక్కడ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఇప్పటికే జిల్లాల వారీగా సర్వేలు పూర్తి చేసిన వైసీపీ అధిష్టానం గెలుపు అవకాశాలు ఉన్న వారికే టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించింది. అందువల్లే వరుసగా నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను మారుస్తున్నారు.