YS JAGAN: చంద్రబాబు వస్తే చంద్రముఖి మళ్లీ వస్తుంది.. వలంటీర్లు భావి లీడర్లు: వైఎస్ జగన్

గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు. జన్మభూమి కమిటీలకు, సచివాలయ వ్యవస్థకు మధ్య చాలా తేడా ఉంది. వలంటీర్లు సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్‌ అందిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2024 | 06:36 PMLast Updated on: Feb 15, 2024 | 6:36 PM

Ys Jagan Fires On Chandrababu Naidu In Guntur Dist Meeting

YS JAGAN: చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రముఖి మళ్లీ వస్తుందని విమర్శించారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు పాలన విషవృక్షమని, తన పాలన కల్పవృక్షమని జగన్ అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వలంటీర్ల సన్మాన సభలో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ”ప్రజలకు సేవలు చేసే వాలంటీర్లే రేపు కాబోయే లీడర్లు. వాలంటీర్ల వ్యవస్థ తులసి మొక్కవనం లాంటిది.

CHIRANJEEVI: ‘అల్లు’కి దూరంగా.. మెగా హీరోలు..

ప్రజలకు సేవలు చేస్తున్న వీరు వలంటీర్లు కాదు.. సేవా హృదయాలు. 2 లక్షల 60 వేల మంది వలంటీర్లు నా సైన్యం. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు. జన్మభూమి కమిటీలకు, సచివాలయ వ్యవస్థకు మధ్య చాలా తేడా ఉంది. వలంటీర్లు సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్‌ అందిస్తున్నారు. గడప గడపకు వెళ్లి పెన్షన్‌ ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదు. వివక్ష లేకుండా ప్రతీ పేదవాడికి పథకాలు అందిస్తున్నాం. లంచాలు, వివక్ష వ్యవస్ధను వాలంటీర్ల బద్దలు కొట్టారు. పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయి. ఇంటింటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య సురక్ష ప్రవేశపెట్టాం. వలంటీర్లు రాబోయే రోజుల్లో భావి లీడర్లు అవుతారు. 58 నెలల పాలనలో వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క. చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం. గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపో​యారు. అందరూ ఓవైపు ఉంటే నేను మాత్రం ఒక్కడినే ఉన్నా. కానీ నా వెనక పెద్ద సైన్యం ఉందనే విషయం వాళ్లకు తెలియటం లేదు.

చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయి. చంద్రబాబు వస్తే.. చంద్రముఖిలు వస్తాయి. చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా అసత్యాలపై యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సిద్ధమంటూ ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి. చంద్రబాబు వేరే రాష్ట్రాల్లోని హామీలను కిచిడీ చేసి మేనిఫెస్టో అంటాడు. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారు. ఎన్నికలయ్యాక చంద్రబాబు మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేస్తారు” అని జగన్ వ్యాఖ్యానించారు.