YS JAGAN: ఏపీలో మార్పుల తుఫాను.. జగన్ పిలుపుతో పరేషాన్..
ఎమ్మెల్యే అనే వ్యక్తి గెలవడు అని రిపోర్ట్ ఉంటే చాలు.. నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తున్నాడు జగన్. ఈ నిర్ణయంలో భాగంగానే ఈరోజు పలువురు ఎమ్మెల్యేలను పిలిపించారు. టికెట్ ఇవ్వలేని వాళ్లకు ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చేశారు.
YS JAGAN: ఏపీలో ఎన్నికల వాతావరణ వేడెక్కిపోయింది. వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ సమన్వయకర్తల మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే అనే వ్యక్తి గెలవడు అని రిపోర్ట్ ఉంటే చాలు.. నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తున్నాడు జగన్. ఈ నిర్ణయంలో భాగంగానే ఈరోజు పలువురు ఎమ్మెల్యేలను పిలిపించారు. మొదట రాయలసీమ సీట్లపై కసరత్తు చేశారు. మంత్రి ఉషశ్రీ చరణ్‌కు పిలుపు వచ్చింది. దూలం నాగేశ్వరావు, మంత్రులు విశ్వరూప్, జయరాం ఎమ్మెల్యేలు రాపాక, చిట్టిబాబు, తిప్పల నాగిరెడ్డి వీళ్ళందరికీ పిలుపు వచ్చింది.
REVANTH REDDY: ఎంపీ అభ్యర్థుల ఎంపిక రేవంత్ చేతుల్లో.. కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోయేది వీళ్లే..
టికెట్ ఇవ్వలేని వాళ్లకు ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చేశారు. స్థానచలనం పొందిన వారిలో మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు. మద్దాలి గిరి, టీజేఆర్ సుధాకర్ బాబు, తిప్పల నాగిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో నో టికెట్ అని చెప్పేసారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట, పి గన్నవరం, రామచంద్రపురం నియోజకవర్గాలకు అభ్యర్థులని మార్చాలని వైసీపీ దాదాపు నిర్ణయం చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, అవనిగడ్డ, పెడనలో మార్పు తప్పదు. ప్రకాశం జిల్లాలో దర్శి అభ్యర్థిని మార్చబోతున్నారు. ఉమ్మడి గుంటూరులో పొన్నూరులో కూడా మార్పు ఉంటుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుగొండ, రాయదుర్గం, కళ్యాణ్ దుర్గంలో క్యాండిడేట్లను మార్చబోతున్నారు. మరి కొంతమందికి మార్పులు లేకపోయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. పలువురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోదింపబోతున్నారు జగన్.
అలాగే మరికొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీకి పంపుతున్నారు. ఇప్పటికే 11 సెగ్మెంట్లలో మార్పులు చేర్పులు జరిగిపోయాయి. రెండో విడత ఐదుగురు ఎమ్మెల్యేలకు నో టికెట్ అని చెప్పే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో పలువురు వైసీపీ సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో నో ఛాన్స్. అమలాపురం నుంచి విశ్వరూప్‌కు స్థానచలనం తప్పదు. గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డికి నో టికెట్ అని చెప్పేశారు. రాపాకను అమలాపురం ఎంపీగా పంపుతారని ప్రచారం జరుగుతోంది. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకి కూడా సెగ్మెంట్ మార్పు తప్పదు. మొత్తం మీద 175లో కనీసం 50 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మార్పు తప్పదు. అందులో కొందరికి పూర్తిగా టికెట్లు నిరాకరిస్తుండగా, మరికొందరిని వేరే నియోజకవర్గానికి మారుస్తున్నారు.