YS JAGAN: సీఎం జగన్‌పై దాడి.. రాయి విసిరిన ఆగంతకులు.. కంటికి గాయం..
ఈ యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం విజయవాడలో జగన్ పర్యటించారు. ఈ యాత్రకు జనం భారీగా పోటెత్తారు. దాదాపు మూడున్నర గంటలుగా జగన్ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర సందర్భంగా సింగ్‌నగర్ డాబా కోట్ల సెంటర్‌లో జనం మధ్యలోంచి ఆగంతకులు పూలతోపాటు జగన్‌పై రాయి విసిరారు.

YS JAGAN: ఏపీ సీఎం జగన్‌పై విజయవాడలో దాడి జరిగింది. జగన్‌పై ఆగంతకులు రాయి విసిరారు. పూలతోపాటు రాయి విసరడంతో జగన్ కంటికి బలంగా తాకింది. దీంతో ఆయన ఎడమ కంటిపైభాగంలో గాయమైంది. జగన్ ప్రస్తుతం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం విజయవాడలో జగన్ పర్యటించారు. ఈ యాత్రకు జనం భారీగా పోటెత్తారు.
దాదాపు మూడున్నర గంటలుగా జగన్ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర సందర్భంగా సింగ్‌నగర్ డాబా కోట్ల సెంటర్‌లో జనం మధ్యలోంచి ఆగంతకులు పూలతోపాటు జగన్‌పై రాయి విసిరారు. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటిపై భాగంలో రాయి బలంగా తాకింది. దీంతో జగన్ కన్ను పైభాగంలో గాయమైంది. కన్ను భాగంలో కొద్దిగా వాచింది. ఈ ఘటనలో జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయమైంది. జగన్‌కు గాయం కావడంతో వెంటనే ఆయనకు బస్సులో ప్రథమ చికిత్స అందించారు. అయితే, పెద్దగా ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పడంతో ప్రథమ చికిత్స తర్వాత జగన్ మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై జగన్ అభిమానులు, వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి.
సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే ఈ దాడికి తెగబడ్డారని విజయవాడ YSRCP నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈ బస్సు యాత్రకు జనం భారీ స్థాయిలో హాజరయ్యారు.