YS JAGAN IN SHOCK: జగన్‌కు షాక్.. టీడీపీలో చేరిన విజయసాయి బావమరిది..
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ వైసీపీకి దిమ్మతిరిగే షాకిచ్చారు విజయసాయి బావమరిది ద్వారకానాథరెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన టీడీపీలో చేరారు.
YS JAGAN IN SHOCK: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అత్యంత కీలక నాయకుల్లో విజయ్ సాయి రెడ్డి ఒకరు. సీఎం జగన్‌కు అత్యంత నమ్మిన వ్యక్తిగా పార్టీ బాధ్యతలను ఆయన ఎప్పటి నుంచో మోస్తున్నారు. కేవలం విజయ్‌సాయిరెడ్డే కాదు.. ఆయన కుటుంబ సభ్యులు కూడా అంతా వైసీపీలోనే కంటిన్యూ అవుతున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ వైసీపీకి దిమ్మతిరిగే షాకిచ్చారు విజయసాయి బావమరిది ద్వారకానాథరెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన టీడీపీలో చేరారు.
REVANTH REDDY: గురువారం ఢిల్లీకి రేవంత్.. షర్మిల కోసమేనా..?
మంగళగిరిలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో ద్వారకానాథ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం ఆయనే కాదు. ఆయన కుటుంబ సభ్యులు కూడా టీడీపీలో చేరారు. ప్రస్తుతం విజయ్‌సాయిరెడ్డి కుటుంబం తప్ప.. మిగిలిన బంధువులంతా టీడీపీకి షిఫ్ట్ ఐపోయారు. ఈ ద్వారకానాథ రెడ్డి ఎవరో కాదు. నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి స్వయానా మేనమామ. గతంలో ద్వారకనాథ రెడ్డి కూడా టీడీపీలోనే ఉన్నారు. 1994లో ఆయన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో పాటు లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కావడం వల్ల ద్వారకానాథరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ జగన్ వైసీపీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరారు.
కానీ అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు మరోసారి టీడీపీకి వెళ్లి షాకిచ్చారు. 175కి 175 స్థానాలు గెలవాలని జగన్ ప్రయత్నిస్తుంటే.. ఆయన దగ్గరి మనుషులే ఆయనకు వెన్నుపోటు పొడుస్తున్నారని చర్చ మొదలైంది. చూడాలి మరి ఈ పరిణామాలన్నీ వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఏ స్థానానికి పరిమితం చేస్తాయో.