YS JAGAN: చంద్రబాబుకు ఓటేస్తే వాలంటీర్లను రద్దు చేసినట్లే: జగన్

చంద్రబాబు పరిపాలన అంతా మోసాలే. అవ్వాతాతలకు, మంచం నుంచి లేవలేని స్థితిలో ఉన్న వారికి, వ్యాధులతో బాధపడుతున్నవారికి ఏ ఇబ్బంది లేకుండా ఇంటి వద్ద పింఛన్ పంపిణీ చేస్తుంటే.. వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేయించి, పింఛన్లు అడ్డుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2024 | 08:45 PMLast Updated on: Apr 02, 2024 | 8:45 PM

Ys Jagan Sensational Comments On Tdp Chief Chandrababu Naidu

YS JAGAN: చంద్రబాబుకు, కూటమికి ఓటు వేస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దుకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినట్లేనన్నారు వైసీపీ అధినేత జగన్. మదనపల్లెలో మంగళవారం నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. “జగన్ అనే వ్యక్తిని ఓడించేందుకు 30 పార్టీలు కలిసి వచ్చినా భయపడం. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా వైసీపీ గెలుపు ఖాయం. కొన్ని తోడేళ్లు గుంపులుగా మన మీద దాడికి వస్తున్నాయి. ఎన్నికల్లో ఒంటరికిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం వారికి లేదు.

KCR ON BJP: అప్పుడు వయొలెంట్.. ఇప్పుడు సైలెంట్.. కేసీఆర్‌కి బీజేపీ అంటే భయమా..?

పేద ప్రజలకు సంక్షేమ పథకాల్ని దూరం చేయడమే చంద్రబాబు, టీడీపీ, జనసేన లక్ష్యం. చంద్రబాబు పరిపాలన అంతా మోసాలే. అవ్వాతాతలకు, మంచం నుంచి లేవలేని స్థితిలో ఉన్న వారికి, వ్యాధులతో బాధపడుతున్నవారికి ఏ ఇబ్బంది లేకుండా ఇంటి వద్ద పింఛన్ పంపిణీ చేస్తుంటే.. వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేయించి, పింఛన్లు అడ్డుకున్నారు. వైసీపీకి మరోసారి ఓటు వేసి ఆశీర్వదిస్తే.. ఇంటి వద్దే అవ్వాతాతలకు పింఛన్ ఇచ్చేలా కొనసాగిస్తాం. టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్లు తొలగిస్తారు. సంక్షేమ పథకాలు తీసేస్తారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలలో 99 శాతం అమలు చేశాం. కానీ చంద్రబాబు ఏ మేనిఫెస్టోను పట్టించుకోరు. చంద్రబాబుకు, కూటమికి ఓటు వేస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేసేందుకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినట్లే. త్వరలో పేదలకు, పెత్తందార్లకు మధ్య జరగనున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలు వైసీపీ పక్షాన ఉన్నారు.

ఈ యుద్ధాన్ని గెలిచి చూపించేందుకు మీరంతా సిద్ధమా..? ఎన్నికల్లో గెలిచేందుకు అమలు చేయలేని ఎన్నో హామీలను చూపించి ప్రజలను మోసం చేయడంలో దిట్ట. చంద్రబాబు మాయమాటలు నమ్మి ఓటు వేస్తే ఏపీ మళ్లీ నాశనం అవుతుంది. మంచి జరిగిందని భావిస్తే నాకు ఓటు వేయండి. మీ ఇంటికి మేలు జరిగిందని భావిస్తే మాకు మరోసారి ఓటు వేసి ఆశీర్వదించండి. అందుకే ఇంటింటికి వెళ్లి మేము చేసిన మంచిని వివరించి, గడప గడపకు తిరిగి ఓట్లు అడుగుతున్నాం” అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.