YS JAGAN: ముగిసిన సిద్ధం యాత్ర.. జగన్‌ కన్నీటి లేఖ..

22 రోజులు.. 2100 కిలోమీటర్లు..16 సభలు, 6 ప్రత్యేక సమావేశాలు, 9 భారీ రోడ్ షోలు. ప్రతీ ప్రాంతంలో ప్రజల నుంచి జగన్‌కు వచ్చిన స్పందన అనన్యసామాన్యం. అనిర్వచనీయం. ప్రజలు తనకు ఇచ్చిన స్పందనకు కృతజ్ఞతగా జగన్‌ తన సందేశాన్ని రిలీజ్‌ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2024 | 05:06 PMLast Updated on: Apr 24, 2024 | 5:06 PM

Ys Jagan Write Letter To Ap People About Completed Memantha Siddham

YS JAGAN: ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు.. జైత్రయాత్రను తలపించింది సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర. అడుగడుగునా నీరాజనాలు.. అరచేతుల్లో హారతి కర్పూరాలతో స్వాగతాలు. 22 రోజులు.. 2100 కిలోమీటర్లు..16 సభలు, 6 ప్రత్యేక సమావేశాలు, 9 భారీ రోడ్ షోలు. ప్రతీ ప్రాంతంలో ప్రజల నుంచి జగన్‌కు వచ్చిన స్పందన అనన్యసామాన్యం. అనిర్వచనీయం. ప్రజలు తనకు ఇచ్చిన స్పందనకు కృతజ్ఞతగా జగన్‌ తన సందేశాన్ని రిలీజ్‌ చేశారు.

CM Revanth Reddy: ఎన్ని ఒట్లు వేస్తావ్ … రేవంత్ ఒట్టుపై విపక్షాల గరం

“నేను కోరినట్లే నాకు అధికారం ఇచ్చారు. కానీ నేను దాన్ని అధికారం అనుకోలేదు. మిమ్మల్ని చూసుకునే బాధ్యత అనుకున్నాను. ప్రతి ఇంట్లో.. ప్రతివ్యక్తికి మంచి చేసే అవకాశం మీరు ఇచ్చారు అనుకున్నాను. ఇది మీ ప్రభుత్వం.. మీ తమ్ముడి ప్రభుత్వం.. మీ సోదరుడి ప్రభుత్వం.. గత డెబ్భయి ఏళ్లలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కానివి ఎన్నో చేసి చూపించాను.. నేను చెప్పినవన్నీ నిజం అనిపిస్తే.. నేను నిజంగా మీకు మేలు చేశాను అనిపిస్తే నాకు ఓటు వేయండి.. నేను మీకేమీ చేయలేదనిపిస్తే నాకు ఓటేయవద్దు. మార్చి 27న ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సుయాత్ర నేడు టెక్కలిలో ముగిసింది. 22 రోజుల పాటు 2100 కిలోమీటర్ల మేర జరిగిన ఈ బస్సు యాత్ర జైత్రయాత్రను తలపించింది. రాష్ట్రవ్యాప్తంగా 15 బహిరంగ సభల్లో ప్రసంగించాను. ఆరు ప్రత్యేక సమావేశాల్లో పాల్గొన్నాను. 86 నియోజకవర్గాలోని కోట్లమందిని స్పృశిస్తూ సాగిన ఈ యాత్ర నాకు ఒక ఆత్మీయ యాత్రగా మారింది. నిప్పులుగక్కే ఎండను లెక్కచేయకుండా మీరు నాకోసం ఎదురుచూసిన తీరు నా జీవితంలో మర్చిపోలేను. నన్ను కలిసి కష్టం చెప్పుకున్న ప్రతీ ఒక్కరికీ నేను అండగా ఉన్నాను.. ఉంటాను. నువ్వు మళ్లీ రావాలి అని అవ్వాతాతలు నాపై చూపిన ప్రేమ ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. మామయ్యా మళ్ళీ నువ్వొస్తావుగా.. అంటూ వీడ్కోలు పలికిన చిన్నారుల చిరునవ్వులు నాకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. మీరు ఇచ్చిన స్పందన నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఇదే స్పూర్తితో త్వరలోనే అధికారం చేపట్టి మళ్లీ మీ ముందుకు వస్తాను” అంటూ చెప్పారు జగన్‌.

ఆయన చేపట్టిన ఈ యాత్ర రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని.. ప్రజల మూడ్ ను మార్చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడికక్కడ జగన్ మావాడే.. నేను సైతం జగన్ వెంట అంటూ వేర్వేరు పార్టీల నుంచి వచ్చి చేరుతున్నవాళ్ళతో జిల్లాల్లో పార్టీ విభాగం కిక్కిరిసిపోతోంది.. రానున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేదానికి ఈ బస్సు యాత్ర ఒక నిదర్శనం.. మళ్ళీ వస్తాను.. మీకు మరింత మంచి చేస్తాను.. అని చెబుతూ జగన్ వెళుతున్న దారిని చూస్తూ ప్రజలు అరచేతుల్లోనే హారతి కర్పూరాలు వెలిగించి విజయీ భావ అంటూ ఆశీర్వదించి పంపించిన తీరు రానున్న ఎన్నికల తీర్పు ఏంటో చెప్పేసింది.