Tirupati, YS Jagan : తిరుపతి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన వాయిదా..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సూళ్లూరుపేట పర్యటనలో మార్పులు, చేర్పులు జరిగి వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంవో కార్యాలయం ప్రకటించింది.

YS Jagan's visit to Tirupati district postponed..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సూళ్లూరుపేట పర్యటనలో మార్పులు, చేర్పులు జరిగి వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంవో కార్యాలయం ప్రకటించింది. నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా రాయదరువు వద్దగల మాంబట్టు ఎస్‌ఈజెడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వద్ద నుంచే సీఎం ఫిష్ ల్యాండిగ్ సెంటర్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ శాఖకు చెందిన పలు అభివృద్ధి పనులు.. రూ.94 కోట్లతో పులికాట్ సరస్సు సముద్ర ముఖ ద్వారం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సింది ఉంది. ఇవాల భారీ వర్షాల కారణంగా కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు. త్వరలోనే రీ షెడ్యూల్ ప్రకటించనున్నారు.