YS JAGAN-YS SHARMILA: ఆస్తిలో వాటా ఇవ్వాలి.. ఆది ఆడబిడ్డల హక్కు.. జగన్‌పై షర్మిల మరో అటాక్
షర్మిల తన సోదరుడు జగన్ నుంచి రూ.82 కోట్లు, వదిన భారతి నుంచి రూ. 19 లక్షల అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే.. అన్నా, వదినల నుంచి షర్మిల ఎందుకు అప్పు తీసుకున్నారు.. ఆస్తిలో వాటా ఇవ్వలేదా.. అనే చర్చ జరుగుతోంది.
YS JAGAN-YS SHARMILA: తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌పై షర్మిల పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఆస్తిలో వాటా ఉంటుందని, వాటా ఇవ్వాలని అన్నారు. షర్మిల తన సోదరుడు జగన్ నుంచి రూ.82 కోట్లు, వదిన భారతి నుంచి రూ. 19 లక్షల అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే.. అన్నా, వదినల నుంచి షర్మిల ఎందుకు అప్పు తీసుకున్నారు.. ఆస్తిలో వాటా ఇవ్వలేదా.. అనే చర్చ జరుగుతోంది.
TDP NOMINATIONS: 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు.. బీఫామ్‌లు అందజేసిన చంద్రబాబు
దీంతో ఈ అంశంపై షర్మిల స్పందించారు. ‘‘ఆస్తిలో అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములు వాటా ఇవ్వాలి. అది ఆడబిడ్డల జన్మ హక్కు. ఆడబిడ్డకు ఇవ్వాల్సిన హక్కు అన్నకు ఉంది. అది బాధ్యత కూడా. సోదరి పిల్లలకు మేనమామ బాధ్యత ఉంటుంది. తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేది మేనమామ కాబట్టి. ఇది అందరూ పాటించే నియమం కూడా. కానీ, కొందరు మాత్రం తమ చెల్లెళ్లకు ఆస్తిలో ఇవ్వాల్సిన వాటాను తమ సొంత సంపాదగా భావిస్తారు. తామేదో చెల్లెళ్ళకు గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. ఒక్క కొసరు చెల్లెళ్ళకు ఇచ్చి అదికూడా అప్పు ఇచ్చినట్లు కొందరు చూపిస్తారు. ఇది వాస్తవం. నా విషయంలో జరిగిన అప్పు గురించి మా కుటుంబం మొత్తానికి తెలుసు. ఆ భగవంతుడికి కూడా తెలుసు. మా పోరాటం ఆస్తుల కోసం కాదు. న్యాయం కోసం. రేపు మాకు, మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు. న్యాయం కోసం మొండిగా పోరాటం చేస్తున్నాం’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
అంటే.. షర్మిల తన అఫడవిట్‌లో జగన్, భారతి దగ్గరి నుంచి తీసుకున్న ఆస్తి.. తనకు రావాల్సిన వాటాయే అని షర్మిల తేల్చేసింది. షర్మిలకు, జగన్‌కు ఆస్తి గొడవలు ఉన్నాయనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని, అందువల్లే జగన్-షర్మిల దూరమయ్యారని సన్నిహితులు చెబుతున్న మాట.