YS SHARMILA: మద్యపాన నిషేధం అంటే ప్రభుత్వమే మద్యం అమ్మడమా..?: వైఎస్ షర్మిల

రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది. పంట నష్ట పరిహారం లేదు. గిట్టుబాటు ధర లేదు. కల్తీ మద్యంతో జనాలను చంపుతారా..? జనాలు కిడ్నీలు, లివర్లు ఫెయిల్ అయ్యి చస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2024 | 02:08 PMLast Updated on: Apr 15, 2024 | 2:08 PM

Ys Sharmila Criticised Ap Cm Ys Jagan In Nellore Dist

YS SHARMILA: జగన్ ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి.. ఇంకో చేత్తో తీసుకుంటోందని విమర్శించారు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఎన్నికల ప్రచారంలో బాగంగా సోమవారం GD నెల్లూర్ నియోజక వర్గంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. జగన్ పాలనపై విమర్శలు చేశారు. “స్థానిక ఎంఎల్ఏ ఉప ముఖ్యమంత్రి అంట కదా..? ఎప్పుడైనా నియోజక వర్గానికి వచ్చాడా..? ప్రజల అవసరాలు తీర్చాడా..? ఈయన లిక్కర్ బాటిల్ మంత్రి అంట. అన్ని కాంట్రాక్టర్లకు ఈయనే బినామీ అంట. మంత్రి బూమ్ బూమ్, క్యాపిటల్ అంట. ఈయన అంబేద్కర్ వారసుడు అని చెప్పుకుంటాడట.

Tesla Cars in India : టెస్లా కారు రూ.20లక్షల లోపే…. ఇండియాలో సేల్స్ కి ఎలాన్ సూపర్ ప్లాన్ !

అంబేద్కర్ వారసుడు అయితే కల్తీ మద్యం అమ్ముతారా..? కల్తీ మద్యంతో జనాలను చంపుతారా..? జనాలు కిడ్నీలు, లివర్లు ఫెయిల్ అయ్యి చస్తున్నారు. ఈ పాపం ఈ లిక్కర్ మంత్రిది కాదా..? మద్య నిషేధం అంటే ప్రభుత్వం మద్యం అమ్మడమా..? నియోజక వర్గంలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా..? మొత్తం మాఫియా.. మట్టి మాఫియా.. ఇసుక మాఫియా. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని హామీ ఇచ్చారట. ఎక్కడ పోయింది హామీ. ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. ఒక చేత్తో ఇస్తారు. ఒక చేత్తో తీసుకుంటారు. 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. నిత్యావసర వస్తువులు రెండింతలు పెంచారు. బటన్ నొక్కడం అంటే ఇచ్చి తీసుకోవడం ఆన్న మాట. 5 జగన్ పాలనలో ఒరిగింది ఏమైనా ఉందా..? రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది. 5 ఏళ్లలో ఉద్యోగాలు ఇచ్చిన మాటే లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2.32లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 23 వేల పోస్టులలో మెగా డీఎస్సీ అన్నారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశావా..? 5 ఏళ్లు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా..? నాలుగున్నర ఏళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్రపోయారు.

ఇప్పుడు లేచారు. హడావిడి చేస్తున్నారు. 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 6 వేలతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో.. లేదో తెలియదు. వ్యవసాయానికి ఆదరణ లేక రైతులు అప్పుల పాలు అయ్యారు. అప్పు లేని రైతు రాష్ట్రంలో లేనే లేడు. పంట నష్ట పరిహారం లేదు. గిట్టుబాటు ధర లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తె రాష్ట్రంలో మూతపడిన చెక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తాం. చెరుకు సాగుకు పెద్దపీట వేస్తాం. రైతులకు 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తాం. 4 వేలు తక్కువ కాకుండా పెన్షన్ నేరుగా అకౌంట్‌లో వేస్తాం. వికలాంగులకు 6 వేలు ఇస్తాం. మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల సహాయం. ఇళ్లు లేని కుటుంబానికి 5 లక్షలతో ఇళ్ళు కట్టిస్తాం. కాంగ్రెస్ గెలవడం అంటే సంక్షేమం మీ ఇంటికి రావడమే. కాంగ్రెస్ గెలుపు అంటే అభివృద్ధి మీ గడపకు రావడం. వైఎస్ఆర్ సుపరిపాలన కాంగ్రెస్‌తోనే సాధ్యం” అని షర్మిల అన్నారు.