YS SHARMILA: ఇదేనా విజన్.. కొట్టడం, మింగడం.. ఇంతకుమించి ఏం చేశావ్‌.. అన్నను ఆడుకున్న షర్మిల..

పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది అంటూ జగన్‌ మీద ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల. పరిపాలన రాజధాని అని చెప్పి.. విశాఖ జనాలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్ అంటూ సెటైర్లు వేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2024 | 02:47 PMLast Updated on: Mar 06, 2024 | 2:47 PM

Ys Sharmila Fires On Ap Cm Ys Jagan About Ap Capitals

YS SHARMILA: చాన్స్ దొరికిన ప్రతీసారి అన్నను ఆడుకుంటున్న షర్మిల.. జగన్ కామెంట్ల మీద మళ్లీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇదీ నీ చేతకానితనం అంటూ.. డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ రాజధాని వ్యవహారంలో నాలుగేళ్లుగా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరమీదకు తీసుకువచ్చిన జగన్ సర్కార్‌.. ఆ తర్వాత అడుగు ముందుకు వేయలేకపోయింది. ఆ పండగ.. ఈ పండగ అని.. జరుపుతూ వచ్చారే తప్ప.. రాజధాని మీద ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.

Varalaxmi Sarathkumar: జయమ్మ ట్విస్ట్.. వరలక్ష్మీ శరత్ కుమార్‌‌‌కు కాబోయే భర్తకు ముందే పెళ్లైందా..!

ఐతే సడెన్‌గా వైజాగ్‌లో పర్యటించిన జగన్‌.. ఎన్నికల తర్వాత విశాఖను రాజధాని చేస్తామని.. ఎన్నికల్లో గెలిచి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ప్రకటన చేశారు. దీనిపై షర్మిల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది అంటూ జగన్‌ మీద ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల. పరిపాలన రాజధాని అని చెప్పి.. విశాఖ జనాలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్ అంటూ సెటైర్లు వేసారు. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా.. చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్ అని ఎద్దేవా చేశారు. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్‌ను కేంద్రం అమ్మేస్తుంటే.. ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్ అని సెటైర్లు వేశారు. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా.. మౌనం వహించడం మీకు ప్రాక్టికల్ విజన్ అంటూ విమర్శలు గుప్పించారు.

గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం.. ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని ఆరోపించారు. ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా అంటూ జగన్‌ను టార్గెట్ చేశారు షర్మిల. ఇప్పటికే వైజాగ్ తరలింపు పేరుతో జగన్ చేస్తున్న ప్రయత్నాలపై విపక్షాలన్నీ విమర్శలు చేస్తుండగా.. ఇప్పుడు షర్మిల కూడా చేరారు. ఐతే సరిగ్గా ఎన్నికల ముందు రాజధాని ప్రస్తావన తీసుకువచ్చి.. జగన్ సెల్ఫ్‌గోల్ కొట్టుకున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.