YS SHARMILA: బీజేపీకి టీడీపీ, వైసీపీ బానిసలు.. జగనన్నా జాబ్ క్యాలెండర్ ఏది: వైఎస్ షర్మిల

ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది. అలాంటి బీజేపీతో TDP, YCPలు దోస్తీ కట్టాయి. బీజేపీకి రెండు పార్టీలు బానిసలుగా మారాయి. ఆంధ్ర రాష్ట్రంలో YSR పాలన ఎక్కడా లేదు. హామీలు ఇచ్చి మోసం చేయడం వైఎస్సార్ పాలన కాదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 26, 2024 | 07:40 PMLast Updated on: Jan 26, 2024 | 7:52 PM

Ys Sharmila Fires On Ap Cm Ys Jagan And Tdp In Guntur

YS SHARMILA: ఏపీని మోసం చేసిన బీజేపీతో వైసీపీ, టీడీపీ దోస్తీ కట్టాయని, ఈ రెండు పార్టీలు బానిసలుగా మారాయని విమర్శించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. గుంటూరు జిల్లాలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ షర్మిలా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంతోపాటు టీడీపీ, జనసేనపై విమర్శలు చేశారు.

TDP-JANASENA: లోకేష్ ఓవర్ యాక్షన్.. లూజ్ టాక్.. టీడీపీ-జనసేన బంధానికి ఎసరు..?

“ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది. అలాంటి బీజేపీతో TDP, YCPలు దోస్తీ కట్టాయి. బీజేపీకి రెండు పార్టీలు బానిసలుగా మారాయి. ఆంధ్ర రాష్ట్రంలో YSR పాలన ఎక్కడా లేదు. వైఎస్ పాలన అంటే.. ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాలు. హామీలు ఇచ్చి మోసం చేయడం వైఎస్సార్ పాలన కాదు. జగనన్న జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ లేదు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. గ్రూప్ 1 లేదు. గ్రూప్ 2 లేదు. అభివృద్ధి పూర్తిగా మరిచారు. ఇది గుంటూరు.. కానీ గుంటలూరుగా మార్చారు. రోడ్లు వేసుకోవడానికి కనీసం నిధులు లేవు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలకు కూడా డబ్బులు లేవు. రైతులకు పంట నష్టపరిహారం లేదు. రైతులను ఆదుకొనే వాళ్ళు లేరు. వ్యవసాయానికి ఉన్న సబ్సిడీ పథకాలు అన్నీ బంద్ పెట్టారు. రైతుకు భరోసా లేకుండా పోయింది. YSR కొడుకు పాలన చేస్తున్నాడు. కానీ వైఎస్సార్‌కి, జగన్ ఆన్నకి.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వైఎస్సార్ తన చివరి శ్వాస వరకు ప్రజల కోసమే బ్రతికాడు. ప్రజల కోసం వెళ్తూనే వెళ్ళిపోయారు. వైఎస్సార్ మరణం తర్వాత పాలకులు నియంతలుగా మారారు.

చివరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు దిక్కు లేదు. వైఎస్సార్ ప్రజా దర్బార్ పెట్టే వాడు. ఇప్పుడు జగన్ జనాలనే చూడడు. బీజేపీతో పొత్తులు పైకి కనిపించవు. రెండు పార్టీలతో బీజేపీ పొత్తు ఎవరికి అర్థం కాదు. B అంటే బాబు.. J అంటే జగన్.. P అంటే పవన్. అందరూ బీజేపీకి బానిసలే. బీజేపీ బిల్లు పెడితే ఒక్క మాట మాట్లాడకుండా ఓటు వేస్తారు. వైఎస్సార్ హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌లు ఇవ్వాలని అనుకున్నారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే 7 శాతం రిజర్వేషన్లు పెరిగేవి. కేంద్రంలో బీజేపీ మతతత్వ పార్టీ. మణిపూర్‌లో 2 వేల చర్చ్‌లను ధ్వంసం చేశారు. జగన్ ఒక క్రిస్టియన్. కానీ, చర్చ్‌లపై దాడులు చేస్తుంటే బీజేపీపై ఒక్క మాట మాట్లాడలేదు. అందుకే రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ కార్యకర్త ప్రతిఒక్కరూ సైనికుడులా మారాలి. కాంగ్రెస్‌కి ఓటేస్తే ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే పోలవరం పూర్తి అవుతుంది. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుంది. గుంటలూరు.. గుంటూరు కావాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి” అని షర్మిల అన్నారు.