YS SHARMILA: వైఎస్ కుటుంబం చీలడానికి జగనే కారణం.. జగన్ ఒక నియంత: వైఎస్ షర్మిల
ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి చంద్రబాబు, జగనే కారణం. ఇవ్వాళ YSR కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది అన్న జగనే. దీనికి దేవుడు, నా తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ సాక్షం.
YS SHARMILA: వైఎస్సార్ కుటుంబం చీలింది అంటే దానికి కారణం వైఎస్ జగనే అని విమర్శించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. దీనికి దేవుడు, తన తల్లి సాక్ష్యం అన్నారు. కాకినాడ జిల్లాలో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి PCC చీఫ్ వైఎస్ షర్మిల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌పై, చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. “కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, నా కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నా అన్న జగన్. దేవుడే గుణపాఠం చెప్తారట.
Janasena : జనసేనలోకి పెరిగిన వలసలు.. పవన్ 60సీట్లు డిమాండ్ చేస్తారా ?
నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి చంద్రబాబు, జగనే కారణం. ఇవ్వాళ YSR కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది అన్న జగనే. దీనికి దేవుడు, నా తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ సాక్షం. నా యావత్ కుటుంబమే దీనికి సాక్షం. జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందిలో ఉంటే, 18 మంది రాజీనామాలు చేసి జగన్ అన్న వైపు నిలబడితే.. అధికారంలో వచ్చాక మంత్రులను చేస్తా అన్నారు. ఇవ్వాళ వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు..? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ, నేను వాళ్ళ కోసం తిరిగాం. వాళ్ళ గెలుపు కోసం పాటు పడ్డాం. వాళ్ళను గెలిపించాం. వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని, పిల్లలను పక్కన పెట్టి, ఎండనక, వాననక రోడ్ల మీదనే ఉన్నా. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కదా అని ఆ యాత్ర కూడా చేశా. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా. ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా, నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా. గత ఎన్నికల్లో బైబై బాబు అంటూ ఊరూరా తిరిగా. దేశంలోనే సక్సెస్‌ఫుల్ క్యాంపెయిన్ చేశా. మిమ్మల్ని గెలిపించా. తర్వాత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి వేరే మనిషిలా మారిపోయాడు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను. తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు.. YSR పేరు, ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నా.
వైఎస్సార్ పేరు నిలబెడాడనుకున్నా..
YSR పేరు నిలబెడతాడు అనుకున్నా. ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారు. బీజేపీకి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. అయినా ఏపిలో బీజేపీ రాజ్యం ఏలుతుంది. జగన్.. ఆయన పార్టీని, రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు. వైఎస్సార్ పనితీరు మీలో కల్పిస్తే మీరు వైఎస్సార్ వారసులు అవుతారు. జగన్ ఆన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ.. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం ఒక పండుగ. వైఎస్సార్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ఇది రైతు రాజ్యం కాదు. వైఎస్సార్ సుపరిపాలన అంతకన్నా కాదు. ఉద్యోగాలు లేవు. నోటిఫికేషన్‌లు ఇవ్వరు. 30 వేల టీచర్ ఉద్యోగ పోస్ట్‌లు భర్తీ చేయాల్సి ఉండగా నోటిఫికేషన్ లేదు. వైఎస్సార్ ప్రజల మనిషి. ప్రజల మధ్యే బ్రతికాడు. ఇప్పుడు జగన్ ఒక నియంత. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు. ప్రజలకు కనపడరు. ఎమ్మెల్యేలను కలవరు. మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు..? వైఎస్సార్ నష్టపోతున్న కంపెనీలను ప్రభుత్వ పరం చేయించారు. మీరు ఉన్న ఆస్తులను అమ్ముతున్నారు. వైఎస్సార్ పేరును చెడగొట్టింది మీరు. ఎంతో మంది త్యాగాలు చేస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యారు.
ప్రజల కోసమే నా నిర్ణయం
నా అనుకున్న వాళ్ళను అందరినీ దూరం చేశారు. వైఎస్సార్ పాలనకు, జగన్ ఆన్న పాలనకు నక్కకు.. నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు సోనియా గాంధీని కలిశా. వాళ్ళు వైఎస్సార్‌పై పెట్టుకున్న ప్రేమ అభిమానాన్ని చూశా. వైఎస్సార్ ఉంటే కాంగ్రెస్‌కి ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నారు. వైఎస్సార్ కుటుంబంలో జరిగిన అన్యాయానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత నేను కాంగ్రెస్‌లో కలిసి పనిచేసేందుకు ఒప్పుకున్నా. నాన్న నాకు నేర్పించింది ప్రజల మధ్య ఉండాలని. నన్ను కాంగ్రెస్.. ఏపికి వెళ్ళమంటే పని చేయాలని నిర్ణయించుకున్నా. ఇక్కడ బీజేపీ చేస్తున్న తెర వెనుక రాజకీయాలను తెలుసుకున్నా. ప్రజలకు జరుగుతుంది అన్యాయం కాబట్టి నేను ఇక్కడ పని చేయాలని అనుకున్నా. ఇది వ్యక్తిగత నిర్ణయం కానే కాదు. నా వ్యక్తిగత నిర్ణయం అయితే. 2019లోనే నిర్ణయం తీసుకున్నా. ఈ నిర్ణయంతో నేను టార్గెట్ అవుతా అని తెలుసు. నన్ను ఎటాక్ చేస్తారని తెలుసు. నా కుటుంబం నిట్ట నిలువునా చీలుతుంది అని తెలుసు. అయినా నేను తీసుకున్న నిర్ణయం ప్రజల కోసమే” అని షర్మిల వ్యాఖ్యానించారు.