YS SHARMILA: చంద్రబాబు ఇంటికి షర్మిల.. కుమారుడి పెళ్లికి ఆహ్వానం..

వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించాం. పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరాను. వైఎస్సార్‌తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చాలా సేపు చర్చ జరిగింది. వైఎస్సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 13, 2024 | 04:42 PMLast Updated on: Jan 13, 2024 | 5:16 PM

Ys Sharmila Met Chandrababu Naidu At His House

YS SHARMILA: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా షర్మిల.. చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. “వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించాం. పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరాను. వైఎస్సార్‌తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చాలా సేపు చర్చ జరిగింది. వైఎస్సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు.

JANASENA: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. జనసేనలోకి మరో సిట్టింగ్‌ ఎంపీ జంప్‌!

రాజకీయ జీవితంలో వైఎస్సార్‌తో ఉన్న అనుభవాలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ భాద్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తాం. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలి. రాహుల్ ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుంది. రాహుల్‌ను ప్రధాని చేయడమే వైఎస్సార్ లక్ష్యం. నాకు భాద్యతలు ఇచ్చిన అంశాన్నిబట్టి చేరికల మీద తర్వాత చెప్తాం. చంద్రబాబును కలవడంపై రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నేను గతంలో క్రిస్మస్ కేకు పంపితే తప్పు పట్టారు. లోకేష్‌కు నేను ఫ్రెండ్లీగా గిఫ్ట్‌ పంపించాను. నేను చంద్రబాబుకే కాదు.. అందరికీ పంపా. ఇక్కడ కేటీఆర్, హరీష్, కవితకు కూడా పంపా. రాజకీయాలు అన్నది జీవితాలు కాదు. రాజకీయాలు ప్రజల కోసం చేస్తున్న సర్వీస్. రాజకీయాలు అనేది మా ప్రొఫెషన్. ఈ క్రమంలో ఒకరిని ఒకరు మాటలు అనుకుంటాం. కేవలం రాజకీయ ప్రత్యర్ధులం మాత్రమే. అందరం ప్రజల కోసమే పని చేయాలి.

పండుగకో, లేదా పెళ్లికో కేకు లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబును కేవలం పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాం. చంద్రబాబు ఒక పార్టీకి అధ్యక్షుడు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. మాకు రాజకీయంగా ఎటువంటి లావాదేవీలు లేవు. వైఎస్సార్ తన బిడ్డల పెళ్లికి చంద్రబాబును పిలిచారు. మా పెళ్లిళ్లకు చంద్రబాబు వచ్చి వచ్చారు. దీవించారు” అని షర్మిల వ్యాఖ్యానించారు.