YS SHARMILA REDDY: సాక్షిలో నాకు సగం వాటా.. నన్ను తిట్టడానికి రోజకో జోకర్‌ వస్తున్నాడు: వైఎస్ షర్మిల

తెలంగాణలో నాతో కలిసి పని చేసిన వాళ్లకు సాక్షి సంస్థ ఫోన్లు చేస్తుంది. నాపై వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారు. ఇదే సాక్షి సంస్థలో నాకు బాగం ఉంది. సగం భాగం ఇచ్చారు వైఎస్సార్. సగం భాగం ఉన్న నాపై నా సంస్థ బురద చల్లుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 29, 2024 | 02:47 PMLast Updated on: Jan 29, 2024 | 2:47 PM

Ys Sharmila Reddy Comments On Her Brother Ys Jagan And Sakshi

YS SHARMILA REDDY: సాక్షి సంస్థలో తనకు సగం వాటా ఉందని, తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చారని గుర్తు చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. తనను తిట్టడానికి వైసీపీ, సాక్షి కలిపి రోజుకో జోకర్‌ను తెస్తున్నారని విమర్శించారు షర్మిల. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ షర్మిలా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “YSR పథకాలే ఒక మార్క్. రోజుకో జోకర్‌ను తెస్తున్నారు. నాపై నిందలు వేపిస్తున్నారు. సాక్షి సంస్థలో నాకు సగ భాగం ఉంది. ఎన్ని నిందలు వేసినా నేను వైఎస్ షర్మిలా రెడ్డినే. నాన్న రక్తమే నాలో ఉంది. పులి కడుపున పులే పుడుతుంది. ఆంధ్ర రాష్ట్రం నా పుట్టినిల్లు. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికే వచ్చా. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఎలా నిందలు వేస్తారో వేయండి. యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి.. ఈ కడప బిడ్డ. వైఎస్సార్.. తన పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలని నిరూపించాడు. వైఎస్సార్ పథకాలు పొందని గడపే లేదు.

khiladi lady: లూటీ చేసిన బ్యూటీ.. ఈమె చాలా డేంజర్‌ గురూ..

పార్టీలకు అతీతంగా అందరూ పథకాలు పొందారు. ఇది వైఎస్సార్ మార్క్ రాజకీయం. రైతులకు రుణమాఫీ వైఎస్సార్ మార్క్. 50 లక్షల మంది బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ వైఎస్సార్ మార్క్. 46 లక్షల పేదలకు పక్కా ఇండ్లు కట్టడం వైఎస్సార్ మార్క్. రైతును రాజు చేయడం వైఎస్సార్ మార్క్. 108 సేవలు వైఎస్సార్ మార్క్. మాట తప్పడం. మడమ తిప్పడం వైఎస్సార్‌కి చేతకాదు. ఇది వైఎస్సార్ మార్క్. తనకు మేలు చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకోవడం వైఎస్సార్ మార్క్. నా అనుకున్న వాళ్లకు ప్రాణం సైతం ఇవ్వడం వైఎస్సార్ మార్క్. నమ్మిన వాళ్ళను మనసులో ఎప్పటికీ ఉంచుకోవడం వైఎస్సార్ మార్క్. ప్రజలకు అందుబాటులో ఉండటం వైఎస్సార్ మార్క్. పథకాలు అందుతున్నాయో లేదో చూడటం వైఎస్సార్ మార్క్. ఇదే కడప జిల్లాకు వైఎస్సార్ ఎంతో చేశాడు. వైఎస్సార్ బ్రతికి ఉంటే కడప జిల్లాకు కడప స్టీల్ వచ్చేది. వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. కడప స్టీల్ వచ్చి ఉంటే 20 వేల ఉద్యోగాలు వచ్చేవి. లక్ష మందికి పరోక్షంగా ఉపాధి దొరికేది. కడప స్టీల్ ఒక కలగానే మిగిలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ప్రాజెక్ట్ ను విభజన హామీల్లో పెట్టింది. చంద్రబాబు 18 వేల కోట్లతో అని మళ్ళీ శంకుస్థాపన చేశారు. బాబు 5 ఏళ్లలో కడప స్టీల్‌పై నిర్లక్ష్యం వహించారు. జగన్ అన్న దీక్షలు కూడా చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ ఆన్న రెండు సార్లు శంకుస్థాపన చేశారు. కడప స్టీల్‌ను శంకుస్థాపన ప్రాజెక్ట్‌గా మార్చారు. వైఎస్సార్ హయాంలో కడప నుంచి బెంగళూర్ వరకు రైల్వే లైన్ అనుమతి తెచ్చారు. కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్ట్‌కు నిధులు కూడా తెచ్చారు. 25 కిలోమేటర్ల వరకు నిర్మాణం జరిగింది. వైఎస్సార్ మరణం తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై పట్టింపు లేదు.

Election Petitions : ఆ ఎమ్మెల్యేల ఎన్నిక అక్రమం… KTR, హరీశ్,కౌశిక్ రెడ్డి సహా 24 మందిపై పిటిషన్లు

జగన్ హయాంలో ఈ రైల్వే లైన్ అవసరం లేదని లేఖ రాశారు. ఒక చిన్న లైన్ చాలని సర్దుకున్నారు. మట్టి బిందెను తీసుకొని బంగారు బిందె ఇచ్చినట్లు ఉంది. మోడీతో దోస్తీ చేసే మీరు ఎందుకు ఈ ప్రాజెక్టులను తేలేక పోయారు. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకు పోతే ఇంత వరకు మరమ్మతులు లేవు. రోడ్డున పడ్డ కుటుంబాలను పట్టించుకోలేదు. వైఎస్సార్ తన జీవితంలో బీజేపీని ఎప్పటికీ వ్యతిరేకించారు. అలాంటి వ్యక్తి ఆశయాలను జగన్ నిలబెడుతున్నారా..? వైఎస్సార్ మైనారిటీలను ప్రేమించే వారు. ఇప్పుడు మైనారిటీలపై బీజేపీ దాడులు చేస్తుంటే జగన్ స్పందించడం లేదు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించలేని మీరు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారు..? బీజేపీని అడిగే దమ్ములేదు. నిలదీసే దమ్ము కూడా లేదు. పోలవరం అడిగే సత్తా లేదు. హోదా కోసం కొట్లాడే పరిస్థితి లేదు. దేశంలో బీజేపీకి వేరే అర్థం ఉంటే.. ఇక్కడ మాత్రం బాబు, జగన్, పవన్. ఈ ఎన్నికల్లో మన జాతకాలు మారాలి. కడప నా పుట్టిన ఇల్లు. జగన్ అన్నలాగే నేను ఇక్కడే పుట్టా. జమ్మలమడుగు ఆసుపత్రిలో నేను పుట్టా. జగన్ అన్నకి నేను వ్యతిరేకి కాదు. జగన్ అన్నది నా రక్తమే. కానీ జగన్ ఆన్న అప్పటి మనిషి కాదు. ఇప్పటి జగన్‌ను ఎప్పుడు చూడలేదు. జగన్‌కు క్యాడర్‌కి, పార్టీకి నేను చేసిన సేవలు గుర్తు లేవు. నా మీద స్టోరీలు అల్లుతున్నారు. రోజుకో జోకర్‌ను తెస్తున్నారు. నా మీద బురద చల్లుతున్నారు. నిన్న ఒక జోకర్‌తో ప్రణబ్ ముఖర్జీ చెప్పాడట. జగన్ జైల్లో ఉన్నప్పుడు నా భర్త అనిల్ సోనియాను కలిశారట. జగన్‌ను బయటకు రానివ్వద్దు అని లాబియింగ్ చేశామట.

ఇప్పుడు చెప్పడానికి ప్రణబ్ లేడు. ఒక పెద్ద మనిషి పేరును కూడా మీరు వదలడం లేదు. మీ కుట్రలకు అంతే లేదు. నాకు పదవి ఆకాంక్ష ఉంటే నాన్నను అడిగి తీసుకోనా..? వైసీపీలోనైనా పదవి తీసుకోనా..? పదవి ఆకాంక్ష ఉంటే మీకోసం నేను ఎందుకు మాట్లాడుతా..? అనిల్, భారతి రెడ్డితో కలిసి సోనియా వద్దకు వెళ్ళారు. భారతికి తెలియకుండా సోనియాను అడిగారా..? భారతి రెడ్డి లేనప్పుడు అడిగారా..? కనీసం ప్రణబ్ ముఖర్జీ కూడా ఎక్కడా చెప్పినట్లు రికార్డ్ కూడా లేదు. తెలంగాణలో నాతో కలిసి పని చేసిన వాళ్లకు సాక్షి సంస్థ ఫోన్లు చేస్తుంది. నాపై వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారు. ఇదే సాక్షి సంస్థలో నాకు బాగం ఉంది. సగం భాగం ఇచ్చారు వైఎస్సార్. సగం భాగం ఉన్న నాపై నా సంస్థ బురద చల్లుతుంది. నేను ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నా. హామీల వైఫల్యాల మీద మాట్లాడుతున్నా. విలువలు, విశ్వసనీయత లేకుండా దిగజారుతున్నారు. ఎవరెంత నిందలు వేసినా నేను వైఎస్ షర్మిలా రెడ్డినే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడకు వచ్చా. ప్రత్యేక హోదా వచ్చే వరకు ఇక్కడ నుంచి కదల. పోలవరం వచ్చే వరకు కదల. ఏం పీక్కుంటారో.. పీక్కోండి” అంటూ షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు.