YS SHARMILA: ఘనంగా షర్మిల కొడుకు పెళ్లి.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా..!

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ప్యాలెస్‌లో తన కొడుకు పెళ్లి చేశారు షర్మిల. అంత్యంత సంపన్నులు మాత్రమే వేడుకలు చేసుకునే ఈ రాజ భవనంలో రాజారెడ్డి పెళ్లి నిజంగా ఓ రాజు పెళ్లిలానే జరిగింది. పెద్దల సమక్షంలో దైవజనుల ఆశీర్వాదంతో క్రిస్టియన్‌ సాంప్రయాదంలో ఈ ప్రేమ జంట భార్యాభర్తలుగా మారారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2024 | 03:04 PMLast Updated on: Feb 19, 2024 | 4:11 PM

Ys Sharmila Shared Son Marriage Video On Social Media

YS SHARMILA: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే హల్దీ సెలబ్రేషన్స్‌ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవ్వగా.. పెళ్లి వీడియోను షర్మిల సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కొడుకు, కోడలికి కంగ్రాట్స్‌ చెప్తూ ఈ లవ్‌లీ వీడియోను షేర్‌ చేశారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ప్యాలెస్‌లో తన కొడుకు పెళ్లి చేశారు షర్మిల. అంత్యంత సంపన్నులు మాత్రమే వేడుకలు చేసుకునే ఈ రాజ భవనంలో రాజారెడ్డి పెళ్లి నిజంగా ఓ రాజు పెళ్లిలానే జరిగింది. పెద్దల సమక్షంలో దైవజనుల ఆశీర్వాదంతో క్రిస్టియన్‌ సాంప్రయాదంలో ఈ ప్రేమ జంట భార్యాభర్తలుగా మారారు.

MEGASTAR CHIRANJEEVI: మెగా రచ్చ.. మరోసారి మెగాస్టార్.. ఊర్వశీ చిందులు

రాజారెడ్డి పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అత్యంత సుందరంగా డెకరేట్‌ చేసిన ప్యాలెస్‌లో కొత్త జంట అందరి చూపును ఆకర్షించింది. ఇక తల్లిదండ్రులతో నూతన వధూవరుల ఫొటోలు.. హల్దీ ఫంక్షన్‌లో తోబుట్టువులతో చేసిన అల్లర్లు.. ఇలా చెప్తూ పోతే ఈ పెళ్లిలో కనిపించిన ఎమోషనల్‌ సీన్స్‌ చాలానే ఉన్నాయి. ఈ పెళ్లి కోసం షర్మిల భారీగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. సాధారంగా ఇలాంటి ప్యాలెస్‌లలో అంబానీ, అదానీ లాంటి బడా వ్యాపారవేత్త ఫంక్షన్స్‌ జరుగుతూ ఉంటాయి. తన కుటుంబంలో జరుగుతున్న మొదటి శుభకార్యం కావడంతో ఏర్పాట్లలో ఏమాత్రం రాజీపడలేదు షర్మిల. ఈ పెళ్లికి దాదాపు 100 కోట్లు షర్మిల ఖర్చు చేసినట్టు ఆమె సన్నిహత వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. వైఎస్‌ఆర్‌ ఫొటో పెట్టుకుని రాజారెడ్డి ప్రియ ఫ్యామిలీస్‌ దిగిన ఫొటో పెళ్లి మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. వైఎస్‌ఆర్‌ ముద్దుల మనవడి పెళ్లి స్వయంగా ఆయనే వచ్చినట్టుగా ఈ ఫొటో కనిపించింది ఈ ఫొటో. భార్యతో కలిసి రాజారెడ్డి నడిచి వస్తున్న విజువల్‌ చూసేందుకు గెస్ట్‌లకు రెండు కళ్లు సరిపోలేదు అనే చెప్పాలి.

ఈ పెళ్లికి అందరూ వచ్చినా ఏపీ సీఎం, షర్మిల అన్న వైఎస్‌ జగన్‌ మాత్రం రాలేదు. ఆయన రాకపోడానికి చాలా మంది చాలా కారణాలు చెప్తున్నారు. బిజీగా ఉండి రాలేదని కొందరు అంటుంటే.. రాజకీయ వైరం కారణంగానే మేనల్లుడి పెళ్లికి దూరంగా ఉన్నాడని కొందరు చెప్తున్నారు. కారణం ఏదైనా.. సొంత మేనల్లుడి పెళ్లికి మాత్రం జగన్‌ రాలేదు. రాజస్థాన్‌లో జరిగిన ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది ఫ్రెండ్స్‌ మాత్రమే వచ్చారు. రాజస్థాన్ నుంచి షర్మిల ఫ్యామిలీ వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రిసెస్షన్‌కు పార్టీ కార్యకర్తలు ఇతర ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతున్నారు. సీఎం జగన్‌ కూడా రిసెప్షన్‌లోనే కొత్త జంటను ఆశీర్వదిస్తారని టాక్‌.