Y.S.Sharmila: కాంగ్రెస్ అధినేత్రి సోనియాని కలిసిన షర్మిల.. విలీనంపై రానున్న స్పష్టత..
వైఎస్ షర్మిల గత కొంత కాలంగా కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపారు. అయినప్పటికీ చర్చలు ఫలించలేదు. తాజగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. మంతనాలు సానుకూలంగా ముగిసినట్లు తెలుస్తుంది. ఈ సారి షర్మిల వెంట తన భర్త అనిల్ కూడా ఉన్నారు.
వైఎస్ షర్మిల గత కొంత కాలంగా కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపారు. అయినప్పటికీ చర్చలు ఫలించలేదు. తాజగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. మంతనాలు సానుకూలంగా ముగిసినట్లు తెలుస్తుంది. ఈ సారి షర్మిల వెంట తన భర్త అనిల్ కూడా ఉన్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆరటీపీ అనే పార్టీ పెట్టి గత కొన్నేళ్లుగా పాదయాత్రల పేరుతో నిర్విరామంగా శ్రమిస్తున్నారు. అయితే ఆమెకు ఆశించినంత ఫలితం రావడంలేదు. పైగా సీఎం కేసీఆర్ తన అధికారాన్ని ఉపయోగించి ఆమెకు అడుగడుగునా విఘ్నాలు సృష్టిస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ కి తలదన్నే పార్టీ కాంగ్రెస్ అని భావించినట్లు సమాచారం. అందుకే ఒంటరిగా పోయేకంటే కాంగ్రెస్ కి మరింత బలాన్ని చేకూర్చి బీఆర్ఎస్ ను అంతమొందించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.
బీజం అక్కడే..
కాంగ్రెస్ విలీనానికి బీజం కర్ణాటక వేదికగా జరిగిందనే వార్తలు గతంలో వెలుగులోకి వచ్చాయి. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం రాక ముందే ఇప్పటి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చలు కాస్త సానుకూలంగానే ముగిసాయి. దీంతో ఆమెను పార్టీలో తీసుకునేందుకు ఢిల్లీ పెద్దలకు ఎప్పించేందుకు డీకే తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు గుసగుసలు వినిపించాయి. అయితే అప్పట్లో కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బిజీ షెడ్యూల్ కారణంగా విలీన ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ కు జోష్ వచ్చింది. ఇదే సమయంలో తెలంగాణలో వైఎస్ అభిమానాన్న ఓట్లుగా మలుచుకునేందుకు షర్మిల ఎంతగానో దోహద పడుతుందన్న ఆలోచనతో ఈమెను పార్టీ విలీనానికి అంగీకరించినట్లు తెలుస్తుంది.
గతంలో వెనుదిరిగిన షర్మిల..
గత వారంలో ఎయిర్ పోర్టులో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో పాటూ షర్మిల కనిపించి బ్రేకింగ్ న్యూస్ అయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ షర్మిల వల్ల కాంగ్రెస్ కు ఒక్క ఓటు వచ్చినా లాభమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే వైఎస్ బిడ్డగా ఆమెకు ఎప్పటికీ కాంగ్రెస్లో చోటు ఉంటుందని అన్నారు. అలాగే గతంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గేని కలిసేందుకు వెళ్లినప్పటికీ సమయం దొరకక అపాయింట్మెంట్ రద్దయిన తరుణంలో వెనుదిరాగారు. మరో సారి కలిసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. దీంతో వెనుదిరగాల్సి వచ్చింది.
సోనియాతో షర్మిల భేటి..
ఇన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాజాగా సోనియా గాంధీతో అపాయింట్మెంట్ దొరికింది. తాజాగా తన భర్త అనిల్ తో కలిసి కాంగ్రెస్ అధినేత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. దాదాపు మంతనాలు ముగిసాయి. అయితే సోనియా పిలుపు షర్మిల విలీనానికే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏ సీటు కేటాయిస్తారన్నిది ఇంకా తెలియలేదు. ఈ సమావేశం తరువాత చాలా వాటికి సమాధానాలు దొరికే పరిస్థితి కనిపిస్తుంది.
సికింద్రాబాద్ ఇస్తామన్న అధిష్టానం..
ఒకవేళ షర్మిల కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేస్తే ఆమెకు సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించాలని అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం అక్కడి క్రిస్టియన్ ఓట్లను రాబట్టేందుకు వేసిన వ్యూహంగా కనిపిస్తుంది. అయితే ఈమె దీనికి అంగీకరిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సోనియాతో షర్మిల భేటీ తెలంగాణ రాజకీయంలో అగ్గిరాజేస్తోందని చెప్పక తప్పదు.
T.V.SRIKAR