YS SHARMILA: కడపలో పోటీతో షర్మిల తప్పు చేస్తోందా? పొలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డేనా..?
కడప జిల్లాలో వైసీపీకి షాక్ తప్పదా.. అన్న మీద చెల్లి పోటీ చేయడంపై జగన్ ఎలా కవర్ చేస్తారు.. ఇలా రకరకాల చర్చ జరుగుతోంది. షర్మిల పోటీ ఒకరకంగా జగన్‌కు, వైసీపీకి ఇబ్బందిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
YS SHARMILA: ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల.. కడప నుంచి అన్న అవినాశ్ మీద ఎంపీగా పోటీ చేయబోతున్నారు. షర్మిల నిర్ణయం ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. వివేకా కేసుపై ఓ వైపు చర్చ జరుగుతున్న వేళ.. ఆ కేసులో ఆరోపణలు ఉన్న అవినాశ్ రెడ్డి మీద చెల్లి షర్మిల పోటీ చేయడం.. ఆసక్తి రేపుతోంది. ఆమె పోటీ వల్ల లాభం ఎవరికి.. నష్టం ఎవరికి.. రాజకీయం ఎలా మారబోతోంది.. కడప జిల్లాలో వైసీపీకి షాక్ తప్పదా.. అన్న మీద చెల్లి పోటీ చేయడంపై జగన్ ఎలా కవర్ చేస్తారు.. ఇలా రకరకాల చర్చ జరుగుతోంది.
JANASENA: జనసేనకు ఈసీ భారీ షాక్.. పవన్ సైకిల్ గుర్తుపై పోటీ చేయాల్సిందేనా..?
షర్మిల పోటీ ఒకరకంగా జగన్‌కు, వైసీపీకి ఇబ్బందిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. కవిత పోటీపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. షర్మిల పోటీతో కీలకమైన ఏడు నియోజకవర్గాలపై ప్రభావం పడుతుందని కొందరి ఒపీనియన్. కడప పార్లమెంటు పరిధిలో బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీలు ఉన్నాయ్. ఈ నియోజకవర్గాలన్నీ వైసీపీకే కంచుకోటలు. ఈ ఏడు స్థానాలపై షర్మిల పోటీ ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతలు వేస్తున్న అంచనా. ఇక కడపతో షర్మిలకు ఎలాంటి అనుబంధం లేదని.. వైఎస్ తనయగా, జగన్ చెల్లిగా మాత్రమే షర్మిలకు గుర్తింపు ఉందని.. ఇప్పుడు పోటీ చేసినంత మాత్రాన ఎలాంటి ఇబ్బంది ఉండదు అని వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. పైగా కాంగ్రెస్‌కు అసలు కేడర్ లేదని.. అలాంటిది ఆ పార్టీ నమ్ముకొని పోటీకి దిగుతూ.. షర్మిల తన పొలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేసుకుంటుందని మరికొందరు అంటున్నారు.
ఇదంతా ఎలా ఉన్నా.. కడపలో షర్మిల పోటీతో వివేకా కేసుపై కడప జిల్లా జనాల అభిప్రాయాలు తెలిసే అవకాశం ఉంది అన్నది మరొక వాదన. వివేకా కేసులో అవినాశ్ రెడ్డి మీదే ఆరోపణలు ఉన్నాయ్. షర్మిల గెలిచినా.. గట్టి పోటీ ఇచ్చినా.. అవినాశ్‌రెడ్డి కార్నర్ అయ్యే అవకాశాలు ఉంటాయ్. అదే అవినాశ్ రెడ్డి.. వార్ వన్ సైడ్ అన్నట్లు గెలిస్తే.. వివేకా కేసు వ్యవహారంలో కడప ఓటర్ల ఆలోచన ఇంకోలా ఉందనే కోణంలో చూడాల్సి ఉంటుందనే చర్చజరుగుతోంది.