YS Sharmila : కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన… ఏపీ కాంగ్రెస్ పార్టీ ఛీప్ వైఎస్ షర్మిలా రెడ్డి
కడప ఎంపీ అభ్యర్థిగా పిసిపి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నేడు నామినేషన్ దాఖల చేయనున్నారు. ఇడుపులపాయ వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలతో నివాళులు అర్పించనున్నారు.

YS Sharmila's nomination as Kadapa MP today..
కడప ఎంపీ అభ్యర్థిగా పిసిపి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నేడు నామినేషన్ దాఖల చేశారు. ఇడుపులపాయ వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలతో నివాళులు అర్పించి.. అక్కడి నుంచి నేరుగా.. కడపలోని ఐటిఐ సర్కిల్ నుంచి రిటర్నింగ్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ వెళ్లారు.
అనంతరం ఉదయం కాసేపటి క్రితమే.. కడప కలెక్టరేట్‌లో నామినేషన్ వేశారు. ఈక ఇక్కడి నుంచి షర్మిల భారీ బహిరంగ సభ ప్రాంగణంకు చేరుకోనున్నారు. కాగా.. సీఎం జగన్‌కు సొంత జిల్లాలోనే సొంత చెల్లెలు షర్మిల చుక్కలు చూపిస్తున్నారు. బాబాయి కూతరు కూడా షర్మిలకు తోడవడంతో ఇద్దరూ కలిసి జగన్‌ను ఇరకాటంలో పడేస్తున్నారు. ఇవాళ సాయంత్రం కర్నూలు జిల్లా కోడుమూరులో కార్నర్ మీటింగ్ జరుగుతుంది. రేపు కర్నూలు నగరంలో షర్మిల పర్యటించనున్నారు.