Zika virus : దేశంలో మళ్లీ జికా వైరస్ కలకలం.. పుణేలో ఇద్దరు ప్రెగ్నెంట్లకు పాజిటివ్

మహారాష్ట్రలోని పుణేలో జికా వైరస్ కలకలం రేపుతుంది. ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి సోకింది. ప్రస్తుతం వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 3, 2024 | 10:15 AMLast Updated on: Jul 03, 2024 | 10:15 AM

Zika Virus Again In The Country Two Pregnant Women In Pune Are Positive

 

 

మహారాష్ట్రలోని పుణేలో జికా వైరస్ కలకలం రేపుతుంది. ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి సోకింది. ప్రస్తుతం వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వైరస్ గర్భిణులకు సోకితే పిండంలో మైక్రోసెఫాలీ సంభవించే ప్రమాదం ఉంటుంది. ఆ పుట్టే బిడ్డల్లో మెదడు అభివృద్ధి చెందదు. తల చాలా చిన్నగా మారే పరిస్థితి లేకపోలేదు. జికా వైరస్‌ సోకిన ఆడ ఎడిస్‌ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. జ్వరం, దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సమస్యలు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇక విషయంలోకి వెళితే..

జికా వైరస్ మహారాష్ట్రలోని ఎరంద్ వానే ప్రాంతంలో మొదటి కేసు నమోదైంది.
పుణెకు చెందిన ఓ వైద్యుడు (46) ఇటీవల జ్వరం బారిన పడ్డాడు. శరీరంపై దద్దుర్లు రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. వారి రక్త నమూనాలు సేకరించి ఆ నగరంలోనే ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించారు. జూన్‌ 21న వారికి జికా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు స్థానిక మునిసిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. అనంతరం అతడి కుటుంబ సభ్యులకు కూడా రక్త పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆయన కుమార్తె (15)కు వైరస్‌ సోకినట్లు తేలింది. కాగా వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు వైద్యులు.. ఒకే ఇంట్లో రెండు కేసులు నమోదు అవ్వడంతో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో ముందు జాగ్రతగా ఆ ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టారు. మరోవైపు ముండ్వా ప్రాంతంలో మరో ఇద్దరు జికా వైరస్ సోకింది అని వైద్యులు గుర్తించారు. వారిలో ఒకరు 47 ఏళ్ల మహిళ, మరొకరు 22 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. పుణే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. జికా వైరస్ సోకిన వారి ప్రాంతాల్లో.. చుట్టుపక్కల ఉన్నవారికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా అని అధికారులు వైద్యపరిక్షలు నిర్వహిస్తున్నారు.

జికా వైరస్ లక్షణాలు ఏంటి?

ఈ జికా వైరస్ సోకిన వారికి జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి రకరకాల లక్షణాలు కనిపిస్తాయి.

తొలిసారిగా “జికా” వైరస్ గుర్తింపు..

జికా వైరస్ మొట్టమొదటి సారిగా 1947లో చీకటి కండం ఆఫ్రికాలోని ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ వైరస్ మొదటగా.. ఉగాండా లోని టాంజానియా ప్రాంతంలోని మానవులలో సంక్రమించి మొదటి కేసు నమోదైంది. ఆ తర్వాత ఆ జికా వైరస్ ఆఫ్రికా దేశాలతో పాటుగా భారత్, అమెరికా, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ లాంటి ఆసియా దేశాలకూ వ్యాపించింది. 2016 నాటికి ప్రపంచంలోని 39 దేశాల్లో ఈ జికా వైరస్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.