Home » నేషనల్
ఆయన నోటికి అడ్డు అదుపు ఉండదు. ఇష్టమొచ్చినట్లు వాగడం ఆయన నైజం. ఆయనేం మాములు వ్యక్తి కాదు...రెండుసార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో...ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీని ఢీకొట్టబోతున్నారు.
తమిళ సినిమా యాక్టర్స్ కు రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సినిమా వాళ్ళే రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఉంటారు. ఎన్నికల్లో ఓడిన గెలిచిన సరే సినిమా వాళ్ళదే ఎక్కువగా డామినేషన్ ఉంటుంది.
తింటే పన్ను... తిరిగితే పన్ను... నిద్రపోతే పన్ను... మేల్కొంటే పన్ను.... ఇవేవో తుగ్లక్ జమానా పన్నులు కావు... మన నిర్మలమ్మ గారి పన్ను పోట్లు...,సామాన్యుడి పాట్లు... ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని కాసుకు కూర్చున్నారు మన కేంద్ర ఆర్థికమంత్రి... లేటెస్ట్గా పాప్‌కార్న్‌పై వేసిన GST శ్లాబులు మీమర్స్‌కు మంచి మసాలాను అందించాయి.
ఒక్క టర్మ్ అధికారంలో ఉండే చాలు.. మునిమనవళ్లకు కూడా సరిపోయేంత ఆస్తులు సంపాదించుకునే రోజులు ఇవి. ఇప్పుడే కాదు.. చాలా ఏళ్లుగా భారత రాజకీయ వ్యవస్థలో కనిపిస్తున్న సీన్ ఇదే.
1991లో రాజకీయాల్లోకి వచ్చిన మన్మోహన్ సింగ్...అస్సాం నుంచి ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019లో రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లారు. పెద్దనోట్ల రద్దు, వ్యవస్థిక్రిత దోపిడిని...చట్టబద్ధమైన దోపిడిగా అభివర్ణిస్తూ చివరిసారి పార్లమెంట్ ప్రసంగించారు.
భారతదేశ రాజకీయ చరిత్రతో ఒక శకం ముగిసింది. కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి.. ప్రధానిగా ప్రగతిపథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్...ప్రొఫెసర్, ఆర్థిక సలహదారు...ఆర్థికవేత్త...ప్రధాన మంత్రి...ఇలా చెప్పుకుంటూ పోతే...చాలానే ఉన్నాయి. జాబితా చాంతాడంత ఉంటుంది. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన మన్మోహన్ సింగ్...ఎన్నో విజయాలు సాధించారు.
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్..ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సహా రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్... అంచెలంచెలుగా జీవితంలో ఎదిగారు. యుకేలో అర్ధశాస్త్రంలో డి.లిట్ చేసిన ఆయన లైఫ్ లో ఊహించని మలుపులు ఉన్నాయి. ఆర్థిక శాఖలో సలహదారుగా చేరిన మన్మోహన్ సింగ్...అదే శాఖను ఆదేశించే స్థాయికి ఎదిగారు.
దేశంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో యూపీనే టాప్. రౌడీ మూకలు, గ్యాంగ్స్టర్లకు ఆ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది కూడా. కానీ, అదంతా గతం. ఇప్పుడు యూపీలో క్రైమ్ చేయాలనే థాట్ వచ్చినా బుల్డోజర్ గుర్తొస్తుంది. ఆ వెంటనే బుల్లెట్ సౌండ్ క్రిమినల్ మైండ్‌లో రీసౌండ్ ఇస్తుంది.