Chhattisgarh : గన్ పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం!
ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఓ గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు.

A huge explosion in the gun powder factory.. 17 people died!
ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఓ గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ భారీ పేలుడికి మృతదేహాలు మాంసపు ముద్దలుగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పలువురు తీవ్రగాయాలైనట్లు సమాచారం. అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్ మొత్తం కుప్పకూలింది. దాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకుని హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రాయ్‌పూర్‌లోని మెహ్‌కర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.