Rahul Gandhi : నేడు కేరళలో భారీ రోడ్ షో.. వాయునాడు నుంచి రాహుల్ నామినేషన్
జాతీయ కాంగ్రెస్ (National Congress) అగ్రనేత రాహుల్ గాంధీ దేశ సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధం అయ్యారు. నేడు కేరళలోని వాయునాడ్ (Wayanad) లోక్ సభ స్థానం నుంచి తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు.

Big road show in Kerala today..Rahul's nomination from Vayunadu
జాతీయ కాంగ్రెస్ (National Congress) అగ్రనేత రాహుల్ గాంధీ దేశ సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధం అయ్యారు. నేడు కేరళలోని వాయునాడ్ (Wayanad) లోక్ సభ స్థానం నుంచి తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. రాహుల్ నామినేషన్ వేసేందుకు ముందుగా.. కల్పేట పట్టణంలో రాహుల్ భారీ కాంగ్రెస్ (Rahul Gandhi) నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రండ్ (UDF) తరహాలో భారీ రోడ్ షో ను నిర్వహించనున్నారు. రోడ్‌షో తరువాత, రాహుల్ గాంధీ.. జాతీయ కాంగ్రెస్ వాయునాడ్ లోక్ సభ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను వయనాడ్ జిల్లా కలెక్టర్ రేణు రాజ్‌కి కల్పేటలోని ఆమె కార్యాలయంలో అధికారికంగా సమర్పించనున్నారు. రాహుల్ వెంట కేపీసీసీ అధ్యక్షుడు కె సుధాకరన్ పార్టీ సీనియర్ నేతలు రమేష్ చెన్నితాల, పీకే కున్హాలికుట్టి తదితర నేతలు ఉంటారు.
గత 2019 ఎన్నికల్లో కేరళలోని 20 స్థానాలకు గానూ యూడీఎఫ్ 19 స్థానాలను కైవసం చేసుకుంది. కాగ గతంలో ఇదే నియోజకవర్గం వాయునాడ్ నుంచి రాహుల్ గాంధీ, 4.3 లక్షల కంటే ఎక్కువ ఓట్లతేడాతో భారీ విజయం సాధించారు.