2024 Elections  : 400+ ఎంపీ సీట్లపై బీజేపీ టార్గెట్..!

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలే టైమ్ ఉంది. దాంతో కేంద్రంలో మూడోసారి కూడా అధికారంలోకి రావాలని బీజేపీ బిగ్ టార్గెట్ పెట్టుకుంది. 400కు పైగా ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది. గతంలో 1984లో రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ 404 స్థానాలు సాధించింది. ఆ రికార్డును బద్దలు కొట్టాలన్నది కమలనాధుల ఆలోచన. ఉత్తరాదితో పాటు దక్షిణాదిపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 23, 2023 | 12:42 PMLast Updated on: Dec 23, 2023 | 7:06 PM

Bjp Target On 400 Mp Seats

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలే టైమ్ ఉంది. దాంతో కేంద్రంలో మూడోసారి కూడా అధికారంలోకి రావాలని బీజేపీ బిగ్ టార్గెట్ పెట్టుకుంది. 400కు పైగా ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది. గతంలో 1984లో రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ 404 స్థానాలు సాధించింది. ఆ రికార్డును బద్దలు కొట్టాలన్నది కమలనాధుల ఆలోచన. ఉత్తరాదితో పాటు దక్షిణాదిపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్.

ఈసారి అలా ఇలా కాదు.. 400 సీట్లకు పైగా గెలుచుకొని హ్యాట్రిక్ కొట్టాలి. కాంగ్రెస్ రికార్డులను బద్దలు కొట్టాలి.. ఇదే ఇప్పుడు బీజేపీ హైకమాండ్ లో ఉన్న ఆలోచన. 2019 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 543 సీట్లల్లో బీజేపీ 303 స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఇంకో 100 చోట్ల కలుపుకొని ఫోర్ హండ్రెడ్ దాటాలని ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. గెలిచిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు.. హిందీ బెల్ట్ ఏరియాలే కావడం.. ఆ పార్టీలో జోష్ నింపింది. ఈ రాష్ట్రాల్లో 65 ఎంపీ సీట్లు ఉన్నాయి. వీటిల్లో 61 స్థానాలను గతంలో కమలం పార్టీయే గెలుచుకుంది. ఇవన్నీ మళ్ళీ సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది బీజేపీ. గత మూడు ఎన్నికల్లో బీజేపీ గెలుచుకోలేకపోయిన 144 లోక్ సభ స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఆ పార్టీ పెద్దలు. ఈ స్థానాల్లో ఇతర పార్టీల్లో ఎవరైనా ప్రముఖులు ఉంటే.. వాళ్ళని ఆకర్షించాలని డిసైడ్ అయ్యారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం కొనసాగుతూనే ఉన్నా.. దక్షిణాదిలో మాత్రం కాంగ్రెస్ లేదంటే ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. మొత్తం లోక్ సభ సీట్లలో 25శాతం అంటే దాదాపు 131 ఎంపీ సీట్లు దక్షిణాదిలో ఉన్నాయి. మరి ఇవన్నీ కమలం ఖాతాలోకి వెళ్ళడం కష్టమే. 2024లో 400కు పైగా స్థానాలను బీజేపీ ఎలా గెలుచుకుంటుంది.. అది సాధ్యమేనా అంటే.. ఆ పార్టీ లీడర్లు మాత్రం సాధ్యమే అంటున్నారు. 2014లో మిషన్ 273+ లోక్ సభ సీట్లను టార్గెట్ గా పెట్టుకున్నాం. సాధించాం.. అలాగే 2019లో అబ్ కీ బార్ 300 పార్ అని ప్రధాని నరేంద్రమోడీ పిలుపు ఇచ్చారు. 303 సీట్లు దక్కాయి. ఇప్పుడు కూడా అంతే… 400కు పైగా గెలుస్తాం… ప్రధానిగా మోడీ మూడోసారి అధికారంలోకి వస్తారని కమలనాథులు థీమాగా చెబుతున్నారు.

నాలుగు నెలల ముందే 160 సీట్లపై బీజేపీ పెద్దలు దృష్టి పెట్టారు. ఈ నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ మొదలైందనీ.. ఎన్నికల దాకా ఇది కంటిన్యూ అవుతుందని బీజేపీ లీడర్లు చెబుతున్నారు. ఆ పార్టీకి చెంది మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, మైనార్టీ మోర్చా, యువ మోర్చా.. ఇలా అన్ని విభాగాల ఓటర్లను కలుసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మహిళా మెర్చా అయితే.. కమల్ దూత్ పేరుతో గ్రామపంచాయతీల్లో మోడీ ప్రభుత్వ లబ్దిదారులను కలుసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా మైనార్టీల ప్రాబల్యం ఉన్న 60 స్థానాలపై బీజేపీ మైనార్టీ మోర్చా లీడర్లు దృష్టి పెట్టారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 5 వేల మందిని తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. 400 సీట్లను బీజేపీ గెలుచుకోవాలంటే దక్షిణాదిపై స్పెషల్ ప్లాన్ కావాల్సి ఉంది. ఉత్తరాదిలో లాగా హిందూత్వ, మైనారిటీ వ్యతిరేక భావజాలం ఇక్కడ పనిచేయవన్నది కర్ణాటక, తెలంగాణ ఎన్నికలతో రుజువైంది. మరి ఇవి కాకుండా ఏ స్ట్రాటజీస్ తో బీజేపీ దక్షిణాదిలో ఓట్లు అడుగుతుంది అన్నది.. మోడీ మేనియా ఎంతవరకు పనిచేస్తుంది అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది.