Fake Passport : ఫేక్ పాస్ పోర్ట్ తో జంప్.. 92 మందిని కనిపెట్టిన సీఐడీ
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెద్ద ఎత్తున నకిలీ పాస్ పోర్టులు (Fake Passport) సృష్టిస్తున్నారు. ఈ నకిలీ పాస్ పోర్టు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక పాస్ పోర్ట్ కుంభకోణంలో తెలంగాణ సీఐడీ (CID) దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు (Forged documents) సృష్టించిన పాస్ పోర్ట్ లు జారీ చేసిన వ్యవహారంలో మరో ఇద్దరు అరెస్టు చేసింది CID.
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెద్ద ఎత్తున నకిలీ పాస్ పోర్టులు (Fake Passport) సృష్టిస్తున్నారు. ఈ నకిలీ పాస్ పోర్టు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక పాస్ పోర్ట్ కుంభకోణంలో తెలంగాణ సీఐడీ (CID) దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు (Forged documents) సృష్టించిన పాస్ పోర్ట్ లు జారీ చేసిన వ్యవహారంలో మరో ఇద్దరు అరెస్టు చేసింది CID. ఇందులో అనంతపురానికి చెందిన ఏజెంట్‌తోపాటు మరొక వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి పాస్‌పోర్ట్‌లు సహా పలు నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
92 నకిలీ పాస్ పోర్టులు గుర్తింపు..
దీంతో ఇప్పటివరకు సీబీఐ అరెస్టు చేసిన నిందితుల సంఖ్య 14కు చేరింది. మరోవైపు ఇప్పటికే 92 నకిలీ పాస్‌పోర్ట్‌లను గుర్తించిన సీఐడీ.. దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది. వీరిలో పలువురు ఇప్పటికే విదేశాలకు కూడా వెళ్ళినట్టు సీఐడీ వెళ్లినట్లు సీఐడీ గుర్తించింది. ఇక దేశం నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారు దేశం దాటకుండా ఉండేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తున్నది. ఇదే విషయాన్ని సీఐడీ అధికారులు విదేశాంగ శాఖకు లెటర్లు రాసిన అప్రమంతం చేసింది.
ఈ నకిలీ పాస్ పోర్టు కుంభకోణంలో హైదరాబాద్ తో సహా.. కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, ఫలక్ నుమా అడ్రస్ లో ఎక్కువ ఫేక్ పాస్ పోర్టులు సృష్టించించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ కుట్రలో కీలక సూత్రధారి అబ్దుస్ సత్తార్ ఒస్మాన్ గా సీఐడీ గుర్తించింది.
నిలోఫర్ హాస్పిటల్ లో నకిలీ బర్త్ సర్టిఫికెట్స్..
హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్ (Nilofar Hospital) పేరుతో నకిలీ బర్త్ సర్టిఫికేట్ సృష్టించి.. టెన్త్ ఫేక్ మెమోలు కూడా కేటుగాళ్లు సృష్టించారు. తప్పుడు ఆధార్, పాన్ కార్డులతో.. ఒకే ఆధార్ నెంబర్ తో అనేక మందికి నకిలీ పాస్ పోర్టులు తయారు చేస్తున్నారు. ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో 35కు పైగా పాస్‌పోర్ట్‌లను రద్దు చేయించేందుకు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఇక ఈ భారీ కుంభకోణంలో అధికారుల ప్రమేయంపై సీఐడీ అధికారుల ఎంక్వైరీ పాస్ పోర్టు జారీలో లోపాలపై నివేదిక రెడీ చేస్తున్న సీఐడీ వెల్లడించింది.