Tamil Nadu Vijay Party : తమిళనాడును ఊపేస్తున్న.. దళపతి విజయ్ కొత్త పార్టీ
తమిళనాడు(Tamil Nadu)లో దళపతి విజయ్ (Dalapathy Vijay) కొత్త పార్టీపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఎందుకు విజయ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు? తమిళనాడు లో పొలిటికల్ స్పేస్ ఉందా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, విజయ్ టీవీకే మధ్యే పోటీ ఉంటుందా? విజయ్ తమిళ రాజకీయాల్ని మలుపు తిప్పుతారా?
తమిళనాడు(Tamil Nadu)లో దళపతి విజయ్ (Dalapathy Vijay) కొత్త పార్టీపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఎందుకు విజయ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు? తమిళనాడు లో పొలిటికల్ స్పేస్ ఉందా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, విజయ్ టీవీకే మధ్యే పోటీ ఉంటుందా? విజయ్ తమిళ రాజకీయాల్ని మలుపు తిప్పుతారా?
తమిళనాడు రాజకీయాలు (Tamil Politics) రసవత్తరంగా మారబోతున్నాయి. దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ కన్ ఫామ్ అయింది. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు హీరో విజయ్. ఈ ప్రకటనతో తమిళనాట ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2026 అసెంబ్లీ ఎన్నికలే (2026 Assembly Elections) లక్ష్యంగా పార్టీ స్థాపించినట్టు చెప్పారాయన. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం పోటీచేయడం లేదని స్పష్టం చేశారు. ఇన్నిరోజులుగా సేవా కార్యక్రమాలకే పరిమితమైన విజయ్ ..ఇప్పుడు పాలిటిక్స్ లోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. సినిమాల్లో తీరిక లేకుండా ఉన్న ఆయన..రాజకీయాల్లోకి రావడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. పార్టీ ప్రకటనకు ముందు విజయ్ మక్కల్ ఇయక్కం…అంటే తన అభిమాన సంఘం నిర్వహకులతో చాలాసార్లు సమావేశమయ్యారు. పార్టీ పేరు, జెండా, అజెండాపై చర్చించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని తేల్చిచెప్పేశారు.
2026 అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటామని చెప్పడంతో…తమిళనాట విజయ్ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చ జోరుగా నడుస్తోంది. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్ డమ్ ఉన్న నటుడు దళపతి విజయ్. కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చురుగ్గా చేస్తున్నారు. టెన్త్ , ప్లస్ వన్ , ప్లస్ టూ మెరిట్ స్టూడెంట్లకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేయడంతో పొలిటికల్ ఎంట్రీని స్పీడప్ చేశారు విజయ్. తరచూ అభిమానుల సంఘాల నిర్వాహకులతో సమావేశమై పార్టీపై సుదీర్ఘ చర్చలు చేశారు. విజయ్ మక్కల్ ఇయక్కం కు చిన్న మార్పులు చేసి తమిళగ వెట్రి కళగం పేరుని పార్టీకి ఫిక్స్ చేశారు.
దళపతి రూటే సెపరేట్. ఎప్పుడూ జనంలో ఉంటూ…అప్పుడప్పుడు రాజకీయాలపై తనదైన స్టయిల్ లో స్పందిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో కనుసైగలతోనే ఫ్యాన్స్ కు సంకేతాలు ఇచ్చేవారు. సినిమాల్లోనూ రాజకీయాలపై పంచ్ లు పేలుస్తూ వచ్చారు. 2018లో వచ్చిన సర్కార్ సినిమాలో ఓట్ రిగ్గింగ్ గురించి దళపతి ప్రస్తావించారు. తన ప్రమేయం లేకుండా పోలైన ఓటును న్యాయపోరాటం ద్వారా సాధించుకునే NRI పాత్రలో ఆయన కనిపించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొందడంతో.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ఛాన్స్ వస్తుంది. అంతకు ముందు ఈ సినిమా ఆడియో ఈవెంట్ లో ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారని అభిమాని అడిగిన ప్రశ్నకు క్లియర్ కట్ గా సమాధానమిచ్చారు విజయ్. సీఎం అయితే.. సినిమాల్లో ఎప్పటికీ నటించనని క్లారిటీ ఇచ్చారు. తనకు తెలిసి చాలామంది రాజకీయ నేతలు పదవుల్లో ఉండి నటించినవారే తప్ప.. ప్రజల కోసం పనిచేసిన వారు లేరన్నారు. ఇప్పుడు ఇవే డైలాగ్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
నిజానికి తమిళనాట రాజకీయాల్లో విజయ్ కు మంచి స్పేస్ ఉంది. ఫ్యాన్ పాలోయింగ్ ని ఓట్లుగా మలిస్తే… బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందనడంలో నో డౌట్. ప్రజల్లోనూ మంచి పేరుంది. అందుకే విజయ్ పార్టీ ప్రకటన సెన్సేషన్ గా మారింది. అరవ రాజకీయాల్లో ఫ్యూచర్ లో ఇద్దరు నేతలే చక్రం తిప్పే అవకాశాలున్నాయి. ఒకరు విజయ్ ఒకరు. ఇంకొకరు ఉదయనిధి స్టాలిన్. ఎందుకంటే తమిళనాడులో అన్నాడీఎంకే పని అయిపోయింది. వర్గపోరుతో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుంది. కమల్ హాసన్ పార్టీని నడపలేకపోతున్నారు. ఆయన పార్టీ పెట్టారే తప్ప ఏమాత్రం ప్రభావం చూపలేదు. రజనీకాంత్ ఎలాగూ పాలిటిక్స్ రానని తేల్చేశారు. జాతీయ పార్టీలకు ఇక్కడ స్పేస్ లేదు. తమిళ మాస్ పాలిటిక్స్ ని విజయ్, ఉదయనిధి ఊపేస్తారనడంలో సందేహం లేదు.
దళపతి విజయ్ సరైన సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు బెస్ట్ ఫ్యూచర్ ఉండబోతోంది. ఇరవై ఏళ్ల భవిష్యత్ ఉంది. 2026లో అసెంబ్లీ ఎన్నికల్ని టార్గెట్ చేసినా…మొదటిసారే అధికారంలోకి రాకపోవచ్చు.కానీ ప్రభావం మాత్రం మామూలుగా ఉండదు. డీఎంకే కు గట్టిపోటీనివ్వడం పక్కా. ఆ తర్వాత టర్మ్ లో విజయ్ నెక్ట్స్ టార్గెట్ పూర్తయ్యే ఛాన్స్ ఉంది. డీఎంకేలో స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ దే కీ రోల్. ఈ ఇద్దరూ తక్కువ వయస్సులోనే రాజకీయాల్లో వచ్చారు. సో రాబోయే ఇరవై ఏళ్లు తమిళరాజకీయాల్ని దున్నేస్తారు. పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉంటుంది. మొత్తానికి విజయ్ పార్టీ తమిళనాడులో సరికొత్త సంచనాలు సృష్టించే ఛాన్స్ ఉంది.