Delhi air pollution: ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు.. హాస్పిటల్స్‌కి జనం క్యూ..
శనివారం వాయు నాణ్యత సూచీ (AQI) 504గా నమోదైంది. జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618గా నమోదైంది. అంటే రాజధాని నగరంలో ఎంత కాలుష్యం పేరుకు పోయిందో అర్థమవుతుంది. విష పూరిత పొగ మంచుతో జనం అల్లాడిపోతున్నారు.
Delhi air pollution: ఢిల్లీ( Delhi)లో కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతోంది. మూడు రోజులుగా వాయు కాలుష్యం (Air pollution) అతి తీవ్ర స్థాయిలోనే కొనసాగుతోంది. శనివారం వాయు నాణ్యత సూచీ (AQI) 504గా నమోదైంది. జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618గా నమోదైంది. అంటే రాజధాని నగరంలో ఎంత కాలుష్యం పేరుకు పోయిందో అర్థమవుతుంది. విష పూరిత పొగ మంచుతో జనం అల్లాడిపోతున్నారు. ఢిల్లీలో విష వాయువుల గాఢత ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విధించిన పరిమితుల కంటే 80 రెట్లు ఎక్కువగా ఉంటోంది.
కాలుష్యంతో ఢిల్లీలో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు, కంటి దురదతో హాస్పిటల్ కి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఈ సీజన్ లో ఇంతగా కాలుష్యం తీవ్రత పెరగడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఢిల్లీ-NCR ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు. మరో రెండు వారాల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ, నోయిడా శివారు ప్రాంతాల్లో పంటల వ్యర్థాలను తగలబెట్టడం వల్లే… ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో CNG, ఎలక్ట్రిక్ బస్సులే తిరుగుతున్నాయి. కానీ ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నుంచి నిషేధిత BS3, BS4 వాహనాలు ఆనంద్ విహార్ డిపోకు వస్తున్నాయి. ఇళా విపరీతంగా పొగను వెదజల్లే వాహనాలను రాకుండా చూడాలని ఢిల్లీ మంత్రులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
బంగ్లాదేశ్ జట్టు ట్రైనింగ్ సెషన్ రద్దు
వన్డే ప్రపంచకప్(ODI World cup 2023) లోభాగంగా బంగ్లాదేశ్ జట్టు ఢిల్లీలో ట్రైనింగ్ సెషన్ కు హాజరుకావాల్సి ఉంది. ఢిల్లీ కాలుష్యాన్ని చూసి బెంబేలెత్తిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ట్రైనింగ్ సెషన్ కూడా బంద్ పెట్టింది. తమ ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బంగ్లాదేశ్ జట్టు ప్రకటించింది. నవంబర్ 6న ఢీల్లీలో బంగ్లాదేశ్- శ్రీలంక (Bangladesh vs Sri lanka) మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు ఢిల్లీకి చేరుకున్నాయి. అయితే, కాలుష్య తీవ్రతతో బంగ్లాదేశ్ జట్టు ట్రైనింగ్ సెషన్ రద్దు చేసుకుంది.