Delhi Mayor Election : ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా…
మరో సారి దేశ రాజధాని ఢిల్లీ (Delhi) మేయర్ (Mayor) ఎన్నికల వాయిదా పడింది.

Delhi Mayor Election Postponed
మరో సారి దేశ రాజధాని ఢిల్లీ (Delhi) మేయర్ (Mayor) ఎన్నికల వాయిదా పడింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు శుక్రవారం (నేడు) ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఎన్నికల తేదీ వచ్చినప్పటికీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రిసైడింగ్ అధికారిని నియమించలేదు.
దీంతో ఈ ఎన్నికలను వాయిదా వేసినట్లు పౌర సంఘం ప్రకటించింది. కాగా, ఈ ఎన్నికల వాయిదాకు బీజేపీ (BJP) నే కారణమని ఆప్ నేతలు ఆరోపించారు. సీఎం నుంచి సలహాలు, సూచనలు లేకుండా తన అధికారాన్ని ఉపయోగించడం సబబు కాదని ఎల్జీ (Delhi Governor) వీకే సక్సేనా వెల్లడించినట్లు సివిక్ బాడీ తమ ప్రకటనలో తెలిపింది. ఎల్జీ తీసుకున్న నిర్ణయం పై ఆప్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తు చేస్తున్నారు. ఇక మధ్య కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (CM Kejriwal) ఏప్రిల్ 1 నుంచి తిహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే…
SSM