Dhoni : హుక్కా తాగుతూ ధోని పోజులు.. ఏమైంది తలైవా.. ఇలా తయారయ్యావ్‌..

వరల్డ్‌ వైడ్‌గా ధోనీకి ఎలాంటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మోర్‌ దెన్‌ క్రికెట్‌.. మాహీ సింప్లిసిటీని.. కూల్‌నెస్‌ అభిమానించే ఫ్యాన్స్‌ కోట్లలో ఉంటారు. ఆయన యాటిట్యూడ్‌ని, మ్యానరిజంని యాజ్‌ ఇట్‌ ఈజ్‌ ఫాలో అవుతుంటారు. ధోనీ సరదా సరదాగా క్యాండిక్రష్‌ ఆడితేనే ఆ గేమ్‌ డౌన్‌లోడ్స్‌ మిలియన్స్‌ దాటి పోయాయి అంటే.. ఫ్యాన్స్‌ మీద ధోనీ ఇన్‌ఫ్లూఎన్స్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 7, 2024 | 04:41 PMLast Updated on: Jan 07, 2024 | 4:41 PM

Dhonis Poses While Smoking Hookah

వరల్డ్‌ వైడ్‌గా ధోనీకి ఎలాంటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మోర్‌ దెన్‌ క్రికెట్‌.. మాహీ సింప్లిసిటీని.. కూల్‌నెస్‌ అభిమానించే ఫ్యాన్స్‌ కోట్లలో ఉంటారు. ఆయన యాటిట్యూడ్‌ని, మ్యానరిజంని యాజ్‌ ఇట్‌ ఈజ్‌ ఫాలో అవుతుంటారు. ధోనీ సరదా సరదాగా క్యాండిక్రష్‌ ఆడితేనే ఆ గేమ్‌ డౌన్‌లోడ్స్‌ మిలియన్స్‌ దాటి పోయాయి అంటే.. ఫ్యాన్స్‌ మీద ధోనీ ఇన్‌ఫ్లూఎన్స్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గేమ్‌ విషయంలోనే కాదు ఫిట్‌నెస్‌ విషయంలో కూడా ధోనీ చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంటాడు. ఎలాంటి బ్యాడ్‌ హ్యాబిడ్స్‌ లేవు. కానీ అలాంటి ధోనీ సడెన్‌గా హుక్కా కొడుతూ కనిపించాడు.

అది కూడా సీక్రెట్‌గా కాదు. పబ్లిక్‌గా అంతా చూస్తుండగానే హుక్కా కొడుతూ ఫోజులిచ్చాడు. అంతే.. ఈ వీడియోతో ఇంటర్నెట్‌ బ్లాస్ట్‌ అయిపోయింది. అసలు ధోనీకి ఏమైంది. ధోనీ హుక్కా కొట్టడమేంటి. అసలు కనిపించేంది ధోనీఏనా.. లేక ఎవరైనా డూపా అంటూ జుట్టు పీక్కుంటున్నారు ఆయన ఫ్యాన్స్‌. కానీ ఆ వీడియోలో కనిపించేంది నిజంగా ధోనీనే. హుక్కా కొడుతుంది కూడా నిజమే. చాలా కాలంగా కమర్షియల్‌ యాడ్స్‌ చేస్తున్న ధోనీ.. రీసెంట్‌గా ఓ వాచ్‌ సంస్థ తరఫున యాడ్‌ చేసేందుకు సైన్‌ చేశారు. ర్యాప్‌ సింగర్‌ ఎంసీ స్టాన్‌తో కలిసి ఈ యాడ్‌లో నటిస్తున్నాడు ధోనీ. ఆ యాడ్‌కి సెట్స్‌ నుంచి లీకైన వీడియోనే ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

ఆ యాడ్‌ షూట్‌లో భాగంగానే ధోనీ ఇలా హుక్కా తాగాడు అంటున్నారు కొందరు. అయితే కొందరు మాత్రం దీనికి యాడ్‌కి ఎలాంటి సంబంధం లేదని.. యాడ్‌ షూట్‌ మధ్యలో ఇలా ధోనీ హుక్కా కొట్టాడని అంటున్నారు. ఇక కొందరు మాత్రం ఆ ఎంసీ స్టాన్‌ మా ధోనీ చెడగొట్టాడని.. అతనే హుక్కా అలవాటు చేసి ఉంటాడని అతన్ని వేసుకుంటున్నారు. హీరో విలన్‌ కొట్టుకుని కమెడీయన్‌ని చంపేసినట్టు.. ధోనీ హుక్కా కొడితే తిట్లు మాత్రం స్టాన్‌కు పడుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ వాదన ఎలా ఉన్నా.. నిజంగానే ధోనీ హుక్కా తాగాడా.. లేక యాడ్‌ కోసం అలా ఫోజిచ్చాడు అనేది ఆయనే చెప్పాలి.