Govind Dholakia : డైమండ్ వ్యాపారికి బీజేపీ రాజ్యసభ సీటు.. అయోధ్యకు 11 కోట్లు విరాళం ఇచ్చినందుకేనా..?
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో గుజరాత్ (Gujarat) నుంచి జేపీ నడ్డా (JP Nadda) తో పాటు గోవింద్ భాయ్ (Govind Bhai) డోలాకియా పేరు కూడా ఉంది. మరో ఇద్దరిని కూడా ప్రకటించింది. అయితే ఈ ఢోలాకియా ఎవరు ? అందరూ ఆయన గురించే సెర్చ్ చేస్తున్నారు.
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో గుజరాత్ (Gujarat) నుంచి జేపీ నడ్డా (JP Nadda) తో పాటు గోవింద్ భాయ్ (Govind Bhai) డోలాకియా పేరు కూడా ఉంది. మరో ఇద్దరిని కూడా ప్రకటించింది. అయితే ఈ ఢోలాకియా ఎవరు ? అందరూ ఆయన గురించే సెర్చ్ చేస్తున్నారు.
గుజరాత్‌లోని సూరత్‌లో ప్రముఖ వజ్రాల వ్యాపారి (Diamond Merchant). ఈమధ్యే అయోధ్య (Ayodhya) లోని బాలక్ రామ్ మందిరానికి ఆయన 11 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. మందిరానికి అంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చింది డోలాకియా ఒక్కరే. గతంలో తన కంపెనీలో పని చేసే 300 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను… దాదాపు 90 లక్షల ఖర్చుతో ప్రత్యేక ఏసీ రైలు బుక్ చేసి 10 రోజుల పాటు ఉత్తరఖండ్ (Uttarakhand) పర్యటన తీసుకెళ్లి వార్తల్లో నిలిచారు.
ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులు గోవింద్ భాయ్ డోలాకియాని కాకాజీ అని పిలుచుకుంటారు.
శ్రీరామ కృష్ణా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Sri Rama Krishna Exports Private Limited) పేరుతో గోవింద్ భాయ్ డోలాకియాకు సూరత్ లో పెద్ద వజ్రాల తయారీ కంపెనీ ఉంది. 1970లో ఈ వజ్రాల కంపెనీని ప్రారంభించారు. డోలాకియా కంపెనీలో ఐదు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ మొత్తం ఆదాయం 1.8 బిలియన్ డాలర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన వ్యాపారి మాత్రమే కాదు… సమాజ సేవలో కూడా ముందు ఉంటారు. అనేక విద్యాసంస్థల్లో, యూనివర్సిటీల్లో మంచి ఉపన్యాసాలు ఇస్తుంటారు. 2014లో ఎస్‌ఆర్‌కే నాలెడ్జ్ ఫౌండేషన్‌ని స్థాపించారు.
ఆమ్రేలికి చెందిన గోవింద్ భాయ్ డోలాకియా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. వజ్రాల కంపెనీలో కార్మికుడిగా పనిచేశారు. ఆ తర్వాత వజ్రాల వ్యాపారిగా ఎదిగారు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి యేటా దీపావళి సందర్భంగా భారీగా బహుమతులు ఇస్తూ ఉంటారు.