అంబానీని బీట్‌ చేసిన అదానీ ఆస్తులు ఎన్ని లక్షల కోట్లో తెలుసా!

అదానీ ఇండస్ట్రీస్‌ అధినేత గౌతమ్‌ అదానీ తానేంటో ప్రూవ్‌ చేసుకున్నారు. హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ.. డబుల్‌ స్పీడ్‌తో కిందటేడాది తన సంపదను భారీగా పెంచుకున్నారు. ఆయన సంపద ఏకంగా 11.6 లక్షల కోట్లకు చేరుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 30, 2024 | 09:12 PMLast Updated on: Aug 30, 2024 | 9:12 PM

Do You Know The Assets Of Adani Who Beat Ambani In Lakhs Of Crores

అదానీ ఇండస్ట్రీస్‌ అధినేత గౌతమ్‌ అదానీ తానేంటో ప్రూవ్‌ చేసుకున్నారు. హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ.. డబుల్‌ స్పీడ్‌తో కిందటేడాది తన సంపదను భారీగా పెంచుకున్నారు. ఆయన సంపద ఏకంగా 11.6 లక్షల కోట్లకు చేరుకుంది. హురున్ ఇండియా రిచ్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌ 2024లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని అధిగమించి దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అదానీ నిలిచారు.

ముకేశ్ అంబానీ సంపద కిందటేడాది 25 శాతం పెరిగి 10.14 లక్షల కోట్లకు చేరుకుంది. హురున్ 2023 రిచ్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌లో అదానీ సంపద 4.74 లక్షల కోట్లు, ముకేశ్ అంబానీ సంపద 8.08 లక్షల కోట్లుగా ఉంది. గత పదేళ్లలో గౌతమ్‌‌‌‌‌‌‌‌ అదానీ సంపద 44 వేల కోట్ల నుంచి 11.6 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే హురున్ ఇండియా రిచ్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌ 2014 లో గౌతమ్ అదానీ పదో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్ శివ్‌‌‌‌‌‌‌‌ నాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని మూడో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

ఆయన సంపద 3.14 లక్షల కోట్లకు పెరిగింది. సీరమ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ బాస్‌‌‌‌‌‌‌‌ సైరస్‌‌‌‌‌‌‌‌ పూనావాలా ఒక స్థానం కోల్పోయి 2.89 లక్షల కోట్ల సంపదతో నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. సన్‌‌‌‌‌‌‌‌ఫార్మా దిలీప్ సంఘ్వీ రిచ్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో తన ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరుచుకున్నారు. గత రిచ్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో ఆరో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కొనసాగిన ఆయన, ఈ ఏడాది ఐదో ర్యాంక్ పొందారు. దిలీప్ సంపద 2.50 లక్షల కోట్లుగా ఉంది.

జెఫ్టో ఫౌండర్లు యంగెస్ట్ బిలియనీర్లు సెల్ఫ్‌‌‌‌‌‌‌‌మేడ్ వుమెన్స్‌‌‌‌‌‌‌‌లో జొహో ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాధా వెంబు టాప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. ఆమె సంపద 47 వేల 500 కోట్లు. జెప్టో ఫౌండర్లు కైవల్య వోహ్రా 3 వేల 600 కోట్లు, అదిత్‌‌‌‌‌‌‌‌ పలిచా 4 వేల 300 కోట్లుతో రిచ్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌లో యంగెస్ట్ బిలియనీర్లుగా నిలిచారు. వెయ్యి కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్నవారిని హురున్ ఇండియా పరిగణనలోకి తీసుకొని ఈ లిస్ట్ తయారు చేసింది.

గత లిస్ట్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది 220 మంది పెరిగారు. దీంతో లిస్టులోని మొత్తం ధనవంతుల సంఖ్య 1,539కు చేరింది. వీరి మొత్తం సంపద కూడా కిందటేడాదితో పోలిస్తే 46 శాతం పెరిగింది. యాక్టర్స్‌లో బాలీవుడ్ యాక్టర్ షారుక్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ హురున్ రిచ్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌లో మొదటిసారిగా ప్లేస్ దక్కించుకున్నారు. ఆయన సంపద 7 వేల 300 కోట్లు ఉంటుందని అంచనా. ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇండస్ట్రీకి చెందిన బిలియనీర్లలో ఆయన టాప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. సెకెండ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్ దక్కించుకున్న జూహీ చావ్లా సంపద 4 వేల 600 కోట్ల కంటే ఆయన సంపద చాలా ఎక్కువ. గత రిచ్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 566 శాతం వృద్ధి చెందిందని హురున్ ఇండియా ప్రకటించింది. వాల్యూ పరంగా చూస్తే అదానీ, అంబానీ సంపద భారీగా పెరిగింది.