TDP : డోన్ నియోజకవర్గం టీడీపీలో మారుతున్న ఈక్వేషన్స్.. కేఈ ఫ్యామిలీ రీ ఎంట్రీ.. ?
ఇటీవ జరుగుతున్న పరిణామాలు చూస్తే డోన్ టీడీపీలో సీన్ మారుతున్నట్టు అర్థమవుతోంది. అధిష్టానం రెండేళ్ళ ముందే ప్రకటించిన అభ్యర్థికి ఎన్నికల్లో బీ ఫామ్ ఇవ్వడం డౌటే అంటున్నారు. కేఈ కుటుంబం తాజా వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఫ్యామిలీ ఫ్యామిలీ.. ఒకే మాట మీదికి వచ్చి టిక్కెట్ ప్రస్తావన తీసుకురావడం, పొలిటికల్ హీట్ పెంచడాన్ని ఎలా చూడాలి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇటీవ జరుగుతున్న పరిణామాలు చూస్తే డోన్ టీడీపీలో సీన్ మారుతున్నట్టు అర్థమవుతోంది. అధిష్టానం రెండేళ్ళ ముందే ప్రకటించిన అభ్యర్థికి ఎన్నికల్లో బీ ఫామ్ ఇవ్వడం డౌటే అంటున్నారు. కేఈ కుటుంబం తాజా వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఫ్యామిలీ ఫ్యామిలీ.. ఒకే మాట మీదికి వచ్చి టిక్కెట్ ప్రస్తావన తీసుకురావడం, పొలిటికల్ హీట్ పెంచడాన్ని ఎలా చూడాలి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల మీద ఒకప్పుడు కేఈ ఫ్యామిలీది గట్టి ముద్ర ఉండేది. డోన్ అసెంబ్లీ నియోజకవర్గం ఆ కుటుంబానికి పెట్టని కోట. డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలాంటి చాలా పదవులు పొందారు కేఈ బ్రదర్స్.. అయితే తర్వాత డోన్‌కు కేఈ కుటుంబం కొంత దూరమైంది. కానీ.. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ఇపుడు ఆ నియోజకవర్గంపై తిరిగి పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్. ఆయన తరచూ డోన్ కు వెళ్ళివస్తూ.. పొలిటికల్ సెగలు పుట్టిస్తున్నారట. తాజాగా అన్న కృష్ణమూర్తి దంపతులు కూడా డోన్‌లో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వారు ఆ మాటలు కాకతాళీయంగా మాట్లాడారా.. లేక వ్యూహాత్మకంగా అన్నారా అనే చర్చ జరుగుతోంది నియోజకవర్గ టీడీపీలో స్థానిక టీడీపీ ఇన్చార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఎవరో తనకు తెలియదని అదే పార్టీలో ఉన్న సీనియర్ నేత కృష్ణమూర్తి అనడంతో పార్టీ శ్రేణులు షాకయ్యాయి.
పార్టీ అధినేత చంద్రబాబు ఏరి కోరి రెండేళ్ళ క్రితమే సుబ్బారెడ్డిని డోన్ అభ్యర్థిగా ప్రకటించారు. అలాంటిది ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి ఇన్ఛార్జ్ ఎవరో తెలియదంటూ కామెంట్స్ చేయడం వెనకున్న రాజకీయం ఏంటని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పైగా.. ఎన్నికలకు ఇంకా టైం ఉందనీ.. సరైన అభ్యర్థి కోసం వెదుకుతున్నామని అన్నారాయన. అదే సమయంలో కృష్ణమూర్తి భార్య వరలక్ష్మి జోక్యం చేసుకొని టీడీపీ తరపున డోన్ నుంచి పోటీ చేయాలని ప్రభాకర్‌కు కోరిక ఉందని చెబుతూనే.. టికెట్ రాకుంటే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయవచ్చని అన్నారు. ముందైతే పోటీ చేసి తర్వాత పార్టీ మారవచ్చని కేఈ వరలక్ష్మి అనడం కలకలం రేపింది. ఆమె అలా మాట్లాడుతుండగానే.. కృష్ణమూర్తి అడ్డుకుని ఇప్పుడు రాజకీయాలు ఎందుకు మాట్లాడతావని వారించడం సన్నివేశాన్ని మరింత రక్తి కట్టించింది. ఇదంతా కాకతాళీయంగా జరిగిందా లేక పీఛే కీ కహానీ బహుత్ హై అన్నట్టుగా ఉందా అంటూ స్థానికంగా ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నట్టు తెలిసింది.
కేఈ ప్రభాకర్ కూడా ఈమధ్య డోన్‌లో గ్రాండ్‌గా బర్త్ డే వేడుకలు చేసుకుని దాదాపు బలప్రదర్శన నిర్వహించారు. అప్పుడే.. జగన్ పులివెందులను వదలడు, చంద్రబాబు కుప్పం వదలడు, కేఈ డోన్‌ని వదలడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. టిడీపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన ధర్మారం సుబ్బారెడ్డి పేరు ప్రస్తావించకుండా విరుచుకుపడ్డారు ప్రభాకర్. ఐదు సర్వేల్లో ఆయన గెలవడని తేలిందనీ.. అభ్యర్థిని మార్చలన్నారు కేఈ ప్రభాకర్. పైగా మంత్రి బుగ్గనతో కుమ్మక్కయ్యారని కూడా ఆరోపించారు. మొత్తమ్మీద కేఈ ఫ్యామిలీ వ్యాఖ్యలతో డోన్ టీడీపీ మరోసారి హాట్ హాట్‌గా మారింది. చివరికి అధిష్టానం రెండేళ్ళ ముందే నిర్ణయించిన అభ్యర్థిది పైచేయి అవుతుందా? లేక కేఈ ఫ్యామిలీది అవుతుందా అన్నది చూడాలి.