Ladakh Battle Tank Accident : లద్దాక్‌లో భారత ఆర్మీ విన్యాశాల్లో ఘోర ప్రమాదం.. నదిలో కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంక్.. 5 జవాన్లు మృతి!
లడఖ్ లో ఇండియన్ ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది. దౌలత్ బెగ్ ఓల్డీ ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన విన్యాసాల్లో ఘోర ప్రమాదం జరిగింది.

Fatal accident in Indian army drills in Ladakh.. Battle tank washed away in river.. 5 soldiers killed!
లడఖ్ లో ఇండియన్ ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది. దౌలత్ బెగ్ ఓల్డీ ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన విన్యాసాల్లో ఘోర ప్రమాదం జరిగింది. లడఖ్‌లో నిన్న దౌలత్ బెగ్ ఓల్డీ ప్రాంతంలో సైనిక డ్రిల్‌లో భాగంగా ఐదుగురు సైనికులు T-72 యుద్ధ ట్యాంకుతో ష్యోక్ నది దాటుతుండగా ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో ఆ నది వరద నీటిలో ఆర్మీ యుద్ధ ట్యాంకర్ తో సహ 5 జవాన్లు నదిలో కొట్టుకపోయారు. ఈ ప్రమాదంలో JCO సహా 5 మంది సైనికులు మరణించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్ల మృతదేహాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఒక్కసారిగా వచ్చిన వరదతో అది మునిగిపోయిందని తెలిపారు. ట్యాంక్‌పై మొత్తం 4-6 మంది సైనికులు ఉన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. లేహ్ కు 130 కి.మీ దూరంలో ఘటన జరిగినట్లు భారత ఆర్మీ గుర్తించింది.