Indonesia Floods : ఇండోనేషియాలో వరదలు.. 15 మంది మృతి
ఇండోనేషియా (Indonesia) లోని దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లో భారీ వర్షాల బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సమీపంలో మూడు నదులు నగరలను ముంచెత్తాయి.

ఇండోనేషియా (Indonesia) లోని దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లో భారీ వర్షాల బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సమీపంలో మూడు నదులు నగరలను ముంచెత్తాయి.
కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. ఒక్కసారిగా నదులు ఉప్పొంగడంతో భారీ వరదలు సంభవించడంతో కనీసం 15 మంది మరణించారు. నీరు, బురదతో నిండిపోవడంతో 13 ఉప జిల్లాలు వరదల బారిన పడ్డాయి. 1,000 కంటే ఎక్కువ ఇళ్లు ప్రభావితమయ్యాయి, వాటిలో 42 కొండచరియలు విరిగిపడటంతో వాటి పునాదులు మరియు రోడ్లు దెబ్బతిన్నాయి.
దీంతో 4000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులైనట్లు ఉత్తర లువు జిల్లా కలెక్టర్ ఇందాపుత్రి వెల్లడించారు. ఇక మరో 74కిపైగా మంది గల్లంతయ్యారు. బాధిత ప్రజలు మసీదులు, షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. కాగా ఇప్పటి వరకు 100 మందికి పైగా బాధఇతులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (National Disaster Management Agency) ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.
Suresh SSM