LOKSABHA POLLS : 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు.. జూన్ 4న కౌంటింగ్
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో (Lok Sabha Elections) పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ (AP Assembly Elections) షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. గతంలో లాగే ఈసారి కూడా సుదీర్ఘంగా ఏడు దశల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి.

General elections in 7 phases.. Counting on June 4
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో (Lok Sabha Elections) పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ (AP Assembly Elections) షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. గతంలో లాగే ఈసారి కూడా సుదీర్ఘంగా ఏడు దశల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 19న మొదటి దశ జరిగితే… మళ్ళీ జూన్ 1న సెవన్త్ స్టేజ్ పోలింగ్ ఉంటుంది. 2019లోనూ ఇలాగే ఎన్నికలు సుదీర్ఘంగా జరగడంతో ఎండా కాలంలో ఓటర్లు ఇబ్బందుల పడ్డారు. ఈసారి దశలను తగ్గించాలని వివిధ రాజకీయ (Politics) పార్టీల నుంచి ఈసీకి విజ్ఞప్తులు అందాయి. కానీ అది సాధ్యపడలేదు. ఈసారి కూడా ఏప్రిల్, మే నెలల్లో మొత్తం 7 దశల్లో పోలింగ్ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల కమిషన్.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో (National General Elections) పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఎంపీ సీట్లకు కూడా మే 13న పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 19న మొదటి దశ పోలింగ్ స్టార్ట్ అవుతోంది. ఏప్రిల్ 26న సెకండ్ ఫేజ్, మే 7న థర్డ్, మే13న ఫోర్త్, మే 20న ఐదో దశ, మే25న ఆరు, జూన్ 1న ఏడో దశతో ఎన్నికలు పూర్తవుతాయి. సార్వత్రిక ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ కౌంటింగ్ జూన్ 4 నిర్వహిస్తారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తవుతున్నాయి. కానీ ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ లో అత్యధికంగా 7 దశల్లో పోలింగ్ జరగనుంది. మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్ లో 5, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ లో 4 దశల్లో, ఛత్తీస్ గఢ్, అసోంలో మూడు దశల్లో, కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్ లో 2 దశల్లో పోలింగ్ జరగనుంది. మిగిలిన 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ ను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేయనుంది.
ఈ ఎన్నికల్లో 97 కోట్ల మందికి పైగా ఓటర్లు ఓటు వేస్తారు. 10 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది ఈసీ. కోటిన్నర మంది పోలింగ్ సిబ్బంది డ్యూటీలో ఉంటారు. ఈ ఎన్నికల కోసం 55 లక్షలకు పైగా EVM లను కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. ఎన్నికల్లో ఓటు వేయడానికి తమ పేరు నమోదు దగ్గర నుంచి ఎన్నికల్లో అక్రమాలపై కంప్లయింట్ చేయడం దాకా అంతా ఆన్ లైన్లో, యాప్స్ ద్వారా ఏర్పాట్లు చేసినట్టు CEC రాజీవ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మళ్ళీ జూన్ 6 వరకూ ఈ కోడ్ అమల్లో ఉంటుంది.