AYODHYA: డేగ కళ్లతో పహారా.. కమాండో కనుసన్నల్లో అయోధ్య
జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో భద్రతా సిబ్బందిని అయోధ్యలోని వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. డీజీపీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జనవరి 22న ఆలయ విధుల్లో పాల్గొనే పోలీసులెవరూ స్మార్ట్ ఫోన్‌లను వాడకూడదు.
AYODHYA: రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా అయోధ్య శత్రుదుర్భేద్యంగా మారబోతోంది! ఆలయం చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గుడిచుట్టూ రెండు జోన్లు ఏర్పాటుచేసి, కమెండోలను, భద్రతా దళాలను మోహరింపచేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో అయోధ్యలో జరగనున్న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో భద్రతా సిబ్బందిని అయోధ్యలోని వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. డీజీపీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జనవరి 22న ఆలయ విధుల్లో పాల్గొనే పోలీసులెవరూ స్మార్ట్ ఫోన్‌లను వాడకూడదు.
REVANTH REDDY: 6 వద్దు 9 ముద్దు.. 6ను నమ్ముకుని కేసీఆర్ మునిగిపోయాడు.. నేను 9లో ఉంటా..
అలాగే ఈ వేడుక ముగిసిన నాలుగు రోజుల తర్వాత జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భద్రతా సిబ్బంది స్మార్ట్ మొబైల్ ఫోన్‌లను ఉపయోగించకూడని డీజీపీ ఉత్తర్వులిచ్చారు. రామమందిర సముదాయానికి సంబంధించిన సమగ్ర భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈ ప్రాంతాన్నంతటినీ రెడ్, ఎల్లో జోన్‌లుగా విభజించారు. రామజన్మభూమి కాంప్లెక్స్‌ను రెడ్ జోన్‌లో ఉంచారు. 6 కంపెనీల CRPF, 3 కంపెనీల PAC , 9 కంపెనీల SSF, 300 మంది పోలీసు సిబ్బంది, 47 మంది అగ్నిమాపక సిబ్బంది, 38 మంది NDRF సిబ్బంది, 40 మంది రేడియో పోలీసు సిబ్బందికి రామాలయం, దాని కాంప్లెక్స్ భద్రత బాధ్యతలు అప్పగించారు. ఇక అయోధ్య భద్రతకు రూ.90 కోట్ల బడ్జెట్ కేటాయించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద అయోధ్యలో ఏఐ ఆధారిత వ్యవస్థను కూడా అమలు చేయనున్నారు.
బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌కు చెందిన రెండు బృందాలు, రెండు విధ్వంసక నిరోధక దళాలు, పీఏసీకి చెందిన ఒక కమాండో యూనిట్, ATS, STFలకు చెందిన ఒక్కో యూనిట్, NSG సహా సెంట్రల్ ఏజెన్సీలను కూడా ఆలయ భద్రత విధుల్లో మోహరించనున్నారు. ఎల్లో జోన్‌లోని కనక్‌భవన్, హనుమాన్‌గఢీ ప్రాంతాల్లో కూడా పటిష్ట భద్రత ఉంటుంది. ఎల్లో జోన్‌లో 34 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 71 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 312 మంది కానిస్టేబుళ్లు భద్రతను పర్యవేక్షించనున్నారు.