Hermes Company : పనోడికి 97 వేల కోట్లు రాసిస్తున్నడు..
వృద్ధాప్యంలో తన బాగోగులను మంచిగా చూసుకున్నడని ఇంట్లో పనిచేసే మనిషికి ఏకంగా 97 వేల కోట్లు రాసిస్తున్నాడు ఓ బిలియనీర్. స్విట్జర్లాండ్‌కు చెందిన నికోలస్ ప్యూచ్ కు పెళ్లి కాలేదు. కానీ ఎప్పటి నుంచో తనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడనీ.. తన కష్టసుఖాల్లో తోడున్నాడనీ తన యావదాస్తిని ఆ సంరక్షకుడికి రాసిస్తున్నడు.
వృద్ధాప్యంలో తన బాగోగులను మంచిగా చూసుకున్నడని ఇంట్లో పనిచేసే మనిషికి ఏకంగా 97 వేల కోట్లు రాసిస్తున్నాడు ఓ బిలియనీర్. స్విట్జర్లాండ్‌కు చెందిన నికోలస్ ప్యూచ్ కు పెళ్లి కాలేదు. కానీ ఎప్పటి నుంచో తనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడనీ.. తన కష్టసుఖాల్లో తోడున్నాడనీ తన యావదాస్తిని ఆ సంరక్షకుడికి రాసిస్తున్నడు.
Anil Ravipudi : అనిల్ రావిపూడి కి ఎందుకు ఎదురు చూపులు..
నికోలస్ కి ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ హెర్మెస్‌లో 5-6 శాతం వాటాలున్నాయి. వాటి విలువ 11 బిలియన్ డాలర్ల ఉంటుంది. అంటే మన భారత కరెన్సెలో చెప్పాలంటే దాదాపు 97 వేల కోట్లకు పైనే. ఈ ఆస్తినంతా 51 ఏళ్ల సంరక్షకుడికి రాసిచ్చేయడానికి పేపర్లు రెడీ చేస్తున్నాడు నికోలస్. అందుకోసం ఓ లీగల్ టీమ్ ను ఏర్పాటు చేసి.. చట్టపరంగా ఆ పనివాడిని దత్తత తీసుకుంటున్నాడు నికోలస్. ఇప్పటికే ఆ సంరక్షకుడికి నికోలస్ 49 కోట్ల విలువైన తన ఆస్తులను అప్పగించినట్లు సమాచారం. మెరాకో, స్విట్టర్జాండ్ లోని కొన్ని నగరాల్లో ఆస్తుల తాళాలను అతని చేతికి ఇచ్చేశారట. నికోలస్ దత్తత తీసుకుంటున్న ఆ పనివాడి పేరు మాత్రం బయటకు రాలేదు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది.
1837లో హెర్మెస్ కంపెనీ థియరీ హెర్మెస్ స్థాపించారు. ఆయన కుటుంబంలో ఐదో తరం వారసుడే నికోలస్ ప్యూచ్. ఆయనకు పెళ్ళి కాలేదు.. పిల్లలు లేరు. కానీ కుటుం సభ్యులతో ఉన్న విభేదాలతో నికోలస్.. తన ఆస్తిని పనివాడికి రాసిస్తున్నట్టు చెబుతున్నారు. నికోలస్ ఆ సంరక్షకుడిని దత్తత తీసుకుంటే.. హెర్మెస్ కుటుంబసభ్యులు కోర్టులో దావా వేయాలని చూస్తున్నారు. దాంతో నికోలస్ కి చట్టపరంగా ఇబ్బందులు తప్పేలా లేదు. స్విట్జర్లాండ్‌లో పెద్దవాళ్లను దత్తత తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. దత్తత వెళ్లే వ్యక్తి మైనర్‌గా ఉన్నప్పుడు కనీసం ఒక ఏడాది పాటు దత్తత తీసుకునే వ్యక్తితో కలిసి జీవించి ఉండాలి. నికోలస్ న్యాయపరంగా చిక్కులు పరిష్కరించుకొని.. తన సంరక్షకుడికి 97 వేల కోట్లు ఎలా రాసిస్తాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.