అఘోరా మొదటి భార్య నేనే.. వెండి తాళి ఎప్పుడు లాక్కున్నాడు..?అసలు ఎన్నాళ్ళీ డ్రామా..?

ఇండియాలో జనాలను గొర్రెలను చేయడం చాలా ఈజీ. ఈ మాట కొందరికి పక్కాగా వర్తిస్తుంది. గత మూడు నాలుగు నెలలుగా అఘోరి అని చెప్పుకుని తిరుగుతూ ఒకడు చేస్తున్న హడావుడి చూసి జనాలు నిజమైన అఘోరి అంటూ కాళ్ళ మీద పడ్డారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2025 | 08:16 PMLast Updated on: Apr 14, 2025 | 8:16 PM

I Am Aghoras First Wife When Did He Steal The Silver Thali How Long Has The Drama Been Going On

ఇండియాలో జనాలను గొర్రెలను చేయడం చాలా ఈజీ. ఈ మాట కొందరికి పక్కాగా వర్తిస్తుంది. గత మూడు నాలుగు నెలలుగా అఘోరి అని చెప్పుకుని తిరుగుతూ ఒకడు చేస్తున్న హడావుడి చూసి జనాలు నిజమైన అఘోరి అంటూ కాళ్ళ మీద పడ్డారు. కొందరు దెబ్బలు తిన్నారు. ఏకంగా తెలంగాణా మంత్రి గారి భార్య కూడా ఆశీస్సులు తీసుకున్న సందర్భం సైతం ఉంది. తీరా చూస్తే.. అఘోరి కాదు.. అఘోరా కాదు. ఫేమస్ అవ్వడానికి వారి వేషం వేసాడనేది తేలింది.

చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోయి అఘోరాల్లో కలిశానని అప్పట్లో హడావుడి చేసాడు. కాని అతని ఒరిజినల్ ఫోటో చూసిన జనాలు.. అసలు అఘోరి మేడం గారు కాదు.. సార్ గారు అని అర్ధమై షాక్ అయ్యారు. మంచిర్యాల జిల్లాలోని నన్నేల మండలం కుషన్‌పల్లి. కుషన్‌పల్లి అనే విలేజ్‌లో ఉండే చిన్నయ్య, చిన్నక్క దంపతుల మూడో సంతానంగా జన్మించిన శ్రీనివాస్ ఈ డ్రామా ఆడుతున్నాడని అర్ధమైంది. ఆపరేషన్‌ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ తరువాత కేదార్‌నాథ్‌కు వెళ్లి అఘోరాల్లో కలిసాడు.

ఇక ఆ తర్వాత శ్రీనివాస్‌ కేదార్‌నాథ్‌ వదిలి బయటే తిరుగుతున్నాడు. కొంత కాలం అర్థనారీశ్వరి పేరుతో వివిధ రాష్ట్రాల్లో హడావుడి చేసాడు. ఇప్పుడు నాగ సాధుగా పేరు మార్చుకుని.. హుండై ఐ20 టాప్‌ ఎండ్‌ కారు వాడుతున్నాడు, ఐఫోన్‌ 15 ప్రొమ్యాక్స్‌ వాడుతున్నాడు. ఇంగ్లీష్‌లో కూడా మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు వైష్ణవి అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆ తర్వాత వైష్ణవి కుటుంబ సభ్యులు.. ఆమెను తీసుకుని వెళ్ళారు. ఇక ఇప్పుడు అఘోరా మొదటి భార్య అంటూ ఒక అమ్మాయి బయటకు వచ్చింది.

వైష్ణవి తనకు కూతురు లాంటిది అంటూ అఘోరా చెప్పాడని.. కాని ఆమెతో శారీరక సంబంధం కూడా కలిగి ఉన్నాడు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. వైష్ణవి మేడలో వెండి తాళి ఉంటుందని.. మార్చ్ 10 న తన దగ్గరకు వచ్చి అది తీసుకుని వెళ్లి ఆమెకు కట్టాడని మొదటి భార్య ఆరోపించింది. ఇక తనకు కట్టిన పసుపు కొమ్ము కూడా చూపించింది. అప్పటి వరకు.. ఆ ఇద్దరికీ పెళ్లి అయిందనే విషయం తనకు తెలియదని.. గట్టిగా అడిగితే నంబర్ బ్లాక్ చేసాడని ఆవేదన వ్యక్తం చేసింది.

తనకు ఏదైనా ఆశ్రమం పెట్టుకోవాలని అనుకున్నామని.. ఇతను కూడా తనకు అనుకూలంగా మాట్లాడటంతో, అతనికి దగ్గరయ్యాను అని చెప్పుకొచ్చింది. తాను మొదటి భార్యనే అంటూ చెప్పగా.. అఘోరా అలియాస్ శ్రీనివాస్ ముందుకు వచ్చి ఆమెకు తనకు ఏ విధమైన సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. దీనితో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి హాట్ టాపిక్ అయింది. మరి నిజా నిజాలు ఏంటో ఆ దేవుడికే ఎరుక.