BRS YCP COMPARE : ఇక్కడ బీఆర్ఎస్ ఓడితే అక్కడ వైసీపీ ..? రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్, టీడీపీ గేమ్ ప్లాన్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న టెన్షన్ ఇక్కడే కాదు.. ఆంధ్రప్రదేశ్ లోనూ కనిపిస్తోంది. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ దాని ప్రభావం పడుతుంది. ఇక్కడ BRS ఓడితే.. అక్కడ వైసీపీ కూడా ఓడిపోతుందా.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే.. ఏపీలో టీడీపీ, జనసేన కూటమి గెలుస్తుందా ?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న టెన్షన్ ఇక్కడే కాదు.. ఆంధ్రప్రదేశ్ లోనూ కనిపిస్తోంది. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ దాని ప్రభావం పడుతుంది. ఇక్కడ BRS ఓడితే.. అక్కడ వైసీపీ కూడా ఓడిపోతుందా.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే.. ఏపీలో టీడీపీ, జనసేన కూటమి గెలుస్తుందా ? కాంగ్రెస్ కి చంద్రబాబు మద్దతు ఇస్తున్నది నిజమేనా ? ఆంధ్రప్రదేశ్ లో బాబుని కాంగ్రెస్ ఆదుకుంటుందా.. ఇలాంటి ప్రశ్నలతో రెండు రాష్ట్రాల్లోని పొలిటికల్ లీడర్లు తెగ టెన్షన్ పడుతున్నారు.
జనరల్ గా ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కీలకం. వరుసగా అధికారంలో ఉన్న సర్కార్లకు ఇలాంటి ఇబ్బందులు ఏ రాష్ట్రంలో అయినా తప్పవు. అది తీవ్ర స్థాయిలో ఉంటే అధికార పార్టీకి మరోసారి ఛాన్స్ ఇవ్వరు జనం. ప్రతిపక్షాలకు పట్టం కడతారు. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి ? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే టైమ్ ఉంది.ఇప్పటికే 10 యేళ్ల పాటు BRS ప్రభుత్వం అధికారంలో ఉంది. పథకాలు రాలేదని చాలామంది పేద, మధ్యతరగతి జనం బీఆర్ఎస్ పై గుర్రుగా ఉన్నారు. అలాగే తటస్థుల ఓట్లు కూడా ఈ ఎన్నికల్లో కీలకం. ఇవన్నీ గులాబీ పార్టీకి పడతాయా..లేదా అన్నదానిపై ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం అనేది తేలుస్తుంది. ఒకవేళ తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాగా పనిచేసి.. బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమవుతుంది. ఇక్కడ ఏమీ కాదు.. కానీ ఆ ప్రభావం పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం మీద పడుతుంది. అక్కడ కూడా జగన్ సర్కార్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ఓడిపోయే ఛాన్సుంది. ఇక్కడ జనం మార్పు కోరుకుంటే.. ఏపీలోనూ అదే జరుగుతుంది. BRS, YCP మధ్య బంధం బాగానే ఉంది. ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. అందుకే తెలంగాణలో BRS పార్టీ రావడానికి వైసీపీ సహకరిస్తుందా అన్నది చూడాలి. ఒకవేళ ఏపీలో వైసీపీకి సహకరించాల్సి వస్తే.. BRS అందుకు ముందుకు వస్తుందా అంటే డౌటే.
ఏపీలో కాంగ్రెస్, జగన్ మధ్య శత్రుత్వం ఉంది. అందువల్ల చంద్రబాబుకి Apలో కాంగ్రెస్ తెర వెనుక మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి.. చంద్రబాబు శిష్యుడు కావడంతో.. ఇప్పటికే తెలంగాణ బరి నుంచి టీడీపీ తప్పుకొని పరోక్షంగా కాంగ్రెస్ కి సహకరిస్తోందన్న వాదనలు ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే.. అక్కడ టీడీపీ అధికారంలోకి రావడానికి తెలంగాణ కాంగ్రెస్ కూడా గట్టిగానే సహకారం అందించే అవకాశాలు లేకపోలేదు. అలాగే టీడీపీని ఇండియా కూటమిలో తీసుకోవడానికి జాతీయస్థాయిలోనూ కాంగ్రెస్ రికమండ్ చేయనుంది. కర్ణాటక, తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీడీపీకి ప్లస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి అన్ని విధాలా సహకారం ఉంటుందని ఆ పార్టీ లీడర్లు భావిస్తున్నారు. సో.. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతే.. ఏపీలో వైసీపీ సర్కార్ పైనా ఎఫెక్ట్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. దీనికితోడు టీడీపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ నుంచి సహకారం కూడా అందనుంది. తెలంగాణలో ఏం జరిగినా.. ఆ ఎఫెక్ట్ ఏపీపైనా పడుతుందని పరిశీలకులు చెబుతున్నారు.