మున్సిపాలిటీ స్వీపర్‌కు కోట్ల ఆస్తులు, 9 లగ్జరీ కార్లు ఆరా తీస్తే పోకిరీ రేంజ్‌ ట్విస్ట్‌..

ఓ ఉన్నతాధికారి ఇంటికి తనిఖీకి వెళ్లిన సీబీఐకి కోట్ల ఆస్తులు పట్టుబడటం చూశాం. ఓ అవినీతి కాంట్రాక్టర్ను కదిలిస్తే వేల కోట్ల నల్లధనం దొరకడం చూశాం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ అవినీతిపరుడి స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా షాకౌతారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 19, 2024 | 04:35 PMLast Updated on: Aug 19, 2024 | 4:35 PM

If The Municipality Sweeper Has Crores Of Assets And 9 Luxury Cars The Rogue Range Twist

ఓ ఉన్నతాధికారి ఇంటికి తనిఖీకి వెళ్లిన సీబీఐకి కోట్ల ఆస్తులు పట్టుబడటం చూశాం. ఓ అవినీతి కాంట్రాక్టర్ను కదిలిస్తే వేల కోట్ల నల్లధనం దొరకడం చూశాం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ అవినీతిపరుడి స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా షాకౌతారు. ఎందుకంటే ఇతను అధికారం చేతిలో ఉన్న వ్యక్తి కాదు.. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వ్యక్తి కూడా కాదు. జస్ట్‌ ఒక మున్సిపల్‌ స్వీపర్‌. స్వీపరే కదా అని తేలిగ్గా తీసేయకండి. మనోడి కలెక్షన్‌ స్టోరీ ఆ రేంజ్‌లో ఉంది మరి.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన సంతోష్‌ కుమార్‌.. జైస్వాల్‌ మున్సిపాలిటీలో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. అవినీతి ఆరోపణలతో రీసెంట్‌గా సంతోష్‌ను సస్పెండ్‌ చేసి ఎంక్వైరీ వేశారు. సంతోష్‌ ఇంటికి వెళ్లిన అధికారులు అతని ఆస్తులు చూసి షాకయ్యారు. జీతం వేలలో వచ్చినా.. ఆస్తులు మాత్రం కోట్లలో కూడబెట్టుకున్నాడు సంతోష్‌. అతని ఇంట్లో ఏకంగా 9 లగ్జరీ కార్లు ఉన్నాయంటే మనోడి సంపాదన ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సంతోష్‌ దగ్గర ఉన్న కార్లు, అతను కూడబెట్టిన ఆస్తులు చూసి అధికారులే షాకైపోయారు. అసలేంటీ వ్యవహారం అని ఆరా తీస్తే.. మున్సిపల్‌ ఆఫీస్‌లో ఉన్న చాలా మంది అధికారుల వ్యవహారం బయటికి వచ్చింది.

స్వీపర్‌గా పని చేస్తూనే ఆఫీస్‌లో అధికారులతో మంచి పరిచయాలు పెంచుకున్నాడు సంతోష్‌. ఫైళ్లను తారుమారు చేయడం, సరిగ్గా లేని ఫైల్స్‌ మీద గుట్టుచప్పుడు కాకుండా సంతకాలు పెట్టించడం సంతోష్‌ దందా. ఇలా చేసి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఇలా లంచాలు తీసుకున్న డబ్బుతోనే ఇల్లు, కార్లు కొనుక్కున్నాడు. ఈ వ్యవహారం మొత్తం బయట పడటంతో ఇప్పుడు సంతోష్‌ సంబంధాలున్న అధికారులను కూడా టార్గెట్‌ చేస్తున్నా సీబీఐ అధికారులు. స్వీపరే ఈ రేంజ్‌లో నొక్కేశాడు అంటే ఇంకా ఆ అధికారులు ఏ రేంజ్‌లో వసూలు చేసి ఉంటారోనని ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా స్వీపర్‌గా పని చేస్తూనే ఇంత లేపేశాడంటే.. సంతోష్‌గానీ ఏ ఎమ్మార్వోనో.. కలెక్టరో ఐతే సంగం ఉత్తర్‌ ప్రదేశ్‌ని అమ్మేసేవాడు అంటున్నారు ఈ వార్త విన్న పబ్లిక్‌.