Top Story: రెండుగా చీలిపోతున్న భారత్…?
భారత్ రెండుగా చీలిపోతుందా...? లక్షల ఏళ్ళ నాడు చీలిన ఖండాల మాదిరిగా భారత్ రెండు ముక్కలు అవుతోందా..? ఆఫ్రికా మాదిరిగానే భారత్ రెండు ఖండాలు కానుందా..?

భారత్ రెండుగా చీలిపోతుందా…? లక్షల ఏళ్ళ నాడు చీలిన ఖండాల మాదిరిగా భారత్ రెండు ముక్కలు అవుతోందా..? ఆఫ్రికా మాదిరిగానే భారత్ రెండు ఖండాలు కానుందా..? అంటే పరిశోధకులు అవుననే సమాధానం చెప్తున్నారు. భారత ఖండాంతర ప్లేట్ రెండుగా విడిపోయే అవకాశం ఉందని ఒక కొత్త అధ్యయనం బయటపెట్టింది. భారత్ లో భూ ఉపరితలం కింద పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఒక టెక్టోనిక్ ప్లేట్ రెండు ముక్కలుగా విడిపోయి పక్కకు జరిగే అవకాశం ఉంది.
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన సైమన్ క్లెంపెరర్ నిర్వహించిన ఈ అధ్యయనంలో.. సహ పరిశోధకులు.. టిబెటన్ స్ప్రింగ్‌లలో ఉన్న హీలియం స్థాయిలను అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ అధ్యయనంలో వారి పరిశోధన ప్రకారం, ఉత్తర టిబెట్‌లోని స్ప్రింగ్‌ల ద్వారా అరుదైన హీలియం-3 ఏర్పడటానికి మాంటిల్ భూమి ఉపరితలానికి దగ్గరగా ఉందని సూచించే ఒక నమూనాను గుర్తించారు. అయితే, దక్షిణ టిబెట్‌లో, ఎక్కువగా లభించే హీలియం-4 స్పష్టంగా ఈ అధ్యయనంలో కనపడుతోంది. ప్రస్తుతానికి ప్లేట్ ఇంకా విడిపోలేదు.
కాని విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రాధమిక ఆధారాల ప్రకారం రెండు ఖండాలుగా భారత్ విడిపోయే అవకాశం ఉందని వెల్లడించారు. దక్షిణ టిబెట్ నుండి సేకరించిన భూకంప డేటా విశ్లేషణ, మునుపటి పరిశోధనలను సమీక్షించిన అనంతరం హిమాలయాల కింద వస్తున్న మార్పులను బయటపెట్టారు. జనవరి 2024 అధ్యయనం ప్రకారం, భారత టెక్టోనిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ వైపు కదులుతూ రెండు పొరలుగా విడిపోతోంది. ఒక్కొక్కటి దాదాపు 100 కిలోమీటర్లు (60 మైళ్ళు) మందం ఉంటుంది.
“డీలమినేషన్” అని పిలువబడే ఈ ప్రక్రియ వల్ల భూ ద్రవ్యరాశి సంవత్సరానికి 2 మిల్లీమీటర్లు తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. టిబెటన్ పీఠభూమి ఎత్తు, హిమాలయ పర్వత శ్రేణి ఏర్పడటాన్ని వివరించే ప్రస్తుత నమూనాలకు విరుద్ధంగా ఈ పరిశోధనలు ఉన్నాయి. భారత, యురేషియన్ క్రస్టల్ శకలాలు.. సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఢీకొన్నాయి. మాంటిల్ లోపల కరిగిన రాతి ప్రవాహాల ద్వారా ముందుకు సాగింది. ప్లేట్ రెండు విభిన్న ముక్కలుగా విడిపోవడం కంటే పొరలుగా చీలిక ఉండే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పరిశోధకులు దక్షిణ టిబెట్‌లో విస్తరించి ఉన్న 94 బ్రాడ్‌బ్యాండ్ భూకంప కేంద్రాల నుండి ఈ అధ్యయనం చేసారు.
https://www.youtube.com/watch?v=yyCJI9s7cf8&pp=0gcJCX4JAYcqIYzv