Isha Ambani: ఇషా స్పెషల్ ఎంట్రీ.. ఒక్క బ్లౌజ్ ధరే కోట్ల రూపాయలు
ఈ వేడుకల్లో ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు ఇషా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరల్డ్‌లోనే ఫ్యాషన్ ఐకాన్‌గా పేరుగాంచిన తన తల్లి నీతా అంబానీకి వారసురాలిని అని చెప్పకనే చెప్పిందా అన్న రేంజ్‌లో ఇషా లుక్ ఆకట్టుకుంది.
Isha Ambani: రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా..? అలాగే దేశంలోని అపర కుబేరుడి ఇంట్లో వేడుకలంటే డబ్బు, నగలు, సంబరాలకు కొదవ ఉంటుందా..? ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మూడురోజుల పాటు జామ్ నగర్‌లో జామ్ జామ్ అంటూ ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వివిధ దేశాలకు చెందిన సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తరలివచ్చారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే.. వీళ్లందరినీ డామినేట్ చేసేసారు అంబానీ ఫ్యామిలీ మహిళలు. ఆ ఈవెంట్స్hలో వాళ్ళు ధరించిన చీరలు, నగల ధరలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.
Mudragada Padmanabham: వైసీపీలోకి కాపు నేత ముద్రగడ.. పవన్‌పై పోటీ చేస్తారా..?
ఇక.. ఈ వేడుకల్లో ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు ఇషా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరల్డ్‌లోనే ఫ్యాషన్ ఐకాన్‌గా పేరుగాంచిన తన తల్లి నీతా అంబానీకి వారసురాలిని అని చెప్పకనే చెప్పిందా అన్న రేంజ్‌లో ఇషా లుక్ ఆకట్టుకుంది. తను వేసుకున్న డ్రెస్సులు, పెట్టుకున్న నగలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాయి. ముకేశ్ అంబానీ-నీతా అంబానీ కూతురు ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తల్లితండ్రులకు తగ్గట్లుగానే పలు వ్యాపారాల్లో రాణిస్తుంది. తను వ్యాపారవేత్త మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్ కూడా. తల్లి నీతా లాగానే ఇషా కూడా ట్రెండ్‌కు తగ్గట్లే తన రిచ్‌నెస్‌ను మెయిన్‌టైన్ చేస్తుంది. నీతా-ఇషా అంబానీ వాడే ప్రతి చిన్న వస్తువు కూడా చాలా రిచ్‌గా, వెరీ వెరీ స్పెషల్‌గా ఉంటాయి. అలాంటిది.. తన తమ్ముడి ప్రీ వెడ్డింగ్ వేడుకలంటే ఇషా వెనక్కి తగ్గుతుందా..? తగ్గేదేలే అన్నట్లుగా తన స్టన్నింగ్ లుక్స్‌తో అతిథులను మెస్మరైజ్ చేసింది. ఇషా అంబానీ రాయల్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో ఇషా ఎరుపు, ఆకు పచ్చరంగు కలిగిన లెహంగాను ధరించింది. ఈ లెహంగాలో ఇషా బాపు బొమ్మలాగా చాలా అందంగా.. అందమైన చందమామలా కనిపించింది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఇషా ఓ మహారాణిలా మెరిసిపోయింది. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఇషా అంబానీ గ్రాండ్ లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇషా వేసుకున్న ఆ లెహంగాను ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీ చేశారు. రెడ్ మరియు గ్రీన్ పూసలతో అలంకరించారు. ప్రఖ్యాత డిజైనర్ ఆ జాకెట్ డిజైన్ త్రీడీలో రూపొందించి.. దాని నమూనా ఆధారంగా వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, రత్నాలను జాకెట్‌కు జత చేసి కుట్టారు. అలా రూపొందించిన జాకెట్‌ను ధరించి ఈషా అంబానీ సందడి చేశారు. ఈ లెహంగా బ్లౌజ్ పూర్తిగా బంగారం, డైమండ్‌లతో హ్యాండ్‌వర్క్ చెయ్యడం వల్ల కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. దీని ధర కూడా కోట్లల్లో ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఆమె డ్రెస్సుకు తగ్గట్లే చెవులకు, నెక్లెస్ ధరించింది. అవి ఆ లెహంగాకు మరింత రిచ్ లుక్‌ను యాడ్ చేశాయి. ఆ జాకెట్ రూపొందించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. వేలాదిమంది వీక్షించి, దాన్ని వైరల్ చేస్తున్నారు. మొత్తానికి అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముగిసి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఇంకా వాటి గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఆ వేడుకలకు సంబంధించి రోజుకో కొత్త విషయం వైరల్ అవుతూనే ఉంది. ప్రీ వెడ్డింగ్‌కే ఇంత హడావిడి ఉంటే ఇక పెళ్లి ఏ రేంజ్‌లో మార్మోగిపోతుందో అంటున్నారు నెటిజన్లు.