Janasena : ఏపీలో జనసేన ఓట్లకు గండి..? ఇదేం ప్లాన్ రా బాబూ !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీని దెబ్బతీయడానికి కొత్త ప్లాన్ రెడీ అవుతోంది. జనసేనకు పోటీగా జాతీయ జనసేన పార్టీ రంగంలోకి దిగుతోంది. జనసేన గుర్తు గాజు గ్లాసును పోలినట్టే.. ఆ పార్టీకి బకెట్ సింబల్ ఎలాట్ అయింది. తమ పార్టీకి వచ్చే ఓట్లను చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు. తెలంగాణలో కూకట్ పల్లిలోలాగే ఏపీలోనూ ఓట్ల చీలిక జరుగుతుందని ఆందోళనచెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీని దెబ్బతీయడానికి కొత్త ప్లాన్ రెడీ అవుతోంది. జనసేనకు పోటీగా జాతీయ జనసేన పార్టీ రంగంలోకి దిగుతోంది. జనసేన గుర్తు గాజు గ్లాసును పోలినట్టే.. ఆ పార్టీకి బకెట్ సింబల్ ఎలాట్ అయింది. తమ పార్టీకి వచ్చే ఓట్లను చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు. తెలంగాణలో కూకట్ పల్లిలోలాగే ఏపీలోనూ ఓట్ల చీలిక జరుగుతుందని ఆందోళనచెందుతున్నారు. వైసీపీ ఐడియాలజీ నుంచే జాతీయ జనసేన పుట్టుకొచ్చిందని ఆగ్రహంగా ఉన్నారు పవన్ అభిమానులు.
అసెంబ్లీ ఎన్నికల్లో.. ప్రధాన రాజకీయ పార్టీలను దెబ్బతీయడానికి.. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేరును పోలిన వాళ్ళని పోటీకి దింపుతుంటారు. ఒక్కోసారి సింబల్స్ కూడా ఇబ్బంది పెడుతుంటాయి. కారు గుర్తును పోలిన చపాతీ కర్ర, ఆటో లాంటి సింబల్స్ కేటాయించవద్దని గతంలో బీఆర్ఎస్ CECకి విన్నవించింది కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు కూడా ఇలాంటి సమస్యే ఎదురుకాబోతోంది. దాదాపు అదే పేరును పోలిన జాతీయ జనసేనతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. జనసేన గుర్తు గాజు గ్లాసు అయితే.. జాతీయ జనసేన పార్టీ సింబల్ బకెట్. ఈ రెండూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అంతేకాదు.. ఆ పార్టీ అధ్యక్షుడి పేరు కూడా పవన్ కల్యాణే.
పవన్ కల్యాణ్ అభిమానులు, ఓటర్లను కన్ ఫ్యూజ్ చేయడానికే ఈ జాతీయ జనసేన పార్టీ పుట్టుకొచ్చిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ జనసేన పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గంలో పోటీ చేసింది. పార్టీ పేరుతో పాటు బకెట్, గాజు గ్లాసు గుర్తులు ఒకే విధంగా ఉండటంతో ఓటర్లు అయోమయంలో పడ్డారు. దాంతో బకెట్ గుర్తుకు 800 ఓట్లు వచ్చాయి. సరిగ్గా ఇదే ప్లాన్ ఏపీలోనూ అమలు చేయాలని చూస్తున్నారు.
ఈ జాతీయ జనసేన వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ కొత్త పార్టీ రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోంది. దాంతో జనసేనకు పడాల్సిన ఓట్లల్లో నియోజకవర్గానికి 2, 3 వేలు చీలినా.. ఫలితాలు తారుమారయ్యే ఛాన్సుంది. అది అధికార పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో వందల ఓట్ల మెజారిటీతోనే అభ్యర్థులు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మరి జాతీయ జనసేన పార్టీని అడ్డుకోడానికి పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నారు.. కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఆశ్రయిస్తారా.. పేరు ఒకేలాగా ఉన్నా.. కనీసం బకెట్ గుర్తు అయినా మార్పించేలా పోరాడాలని జనసేన లీడర్లు, కార్యకర్తలు కోరుతున్నారు. లేకపోతే ఏపీ ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని ఆవేదన చెందుతున్నారు