Jio Recharges : జియో ఛార్జీల బాదుడు….. అన్యాయం మావా…. అనంత్ పెళ్ళి ఖర్చు మా మీద వేస్తావా ?

ఒకప్పుడు ఫ్రీ అన్నాడు... ఆ తర్వాత మిగతా సర్వీస్ ప్రొవైడర్ల కన్నా తక్కువ రేట్లకు జనాన్ని ఆకర్షించారు. ఇప్పుడేమో 27శాతం ఛార్జీల బాదుడు. జియో మొబైల్ రీఛార్జీలు అమాంతం పెరిగిపోతున్నాయి. జులై 3 నుంచి కొత్త టారిఫ్స్ మోత మోగిపోతోంది. జనం ఆదరణ పొందిన కొన్ని ప్లాన్స్ ని పూర్తిగా ఎత్తేశారు. ఓ వైపు అనంత్ అంబానీ పెళ్ళికి కోట్లు కోట్లు ఖర్చుపెడుతున్న ముఖేష్... ఆ ఖర్చును మా దగ్గర వసూలు చేస్తున్నావా అని నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 28, 2024 | 01:54 PMLast Updated on: Jun 28, 2024 | 2:55 PM

Jio Recharges

ఒకప్పుడు ఫ్రీ అన్నాడు… ఆ తర్వాత మిగతా సర్వీస్ ప్రొవైడర్ల కన్నా తక్కువ రేట్లకు జనాన్ని ఆకర్షించారు. ఇప్పుడేమో 27శాతం ఛార్జీల బాదుడు. జియో మొబైల్ రీఛార్జీలు అమాంతం పెరిగిపోతున్నాయి. జులై 3 నుంచి కొత్త టారిఫ్స్ మోత మోగిపోతోంది. జనం ఆదరణ పొందిన కొన్ని ప్లాన్స్ ని పూర్తిగా ఎత్తేశారు. ఓ వైపు అనంత్ అంబానీ పెళ్ళికి కోట్లు కోట్లు ఖర్చుపెడుతున్న ముఖేష్… ఆ ఖర్చును మా దగ్గర వసూలు చేస్తున్నావా అని నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.

జులై 3 నుంచి మీ జియో నెంబర్ రీఛార్జ్ చేయించుకోవాలంటే.. అదనంగా 12 నుంచి 27శాతం డబ్బులు ఎక్కువగా పే చేయాలి. సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ ఛార్జీలను పెంచాలని చూశారు. ముఖేష్ అంబానీ మోడీ ఫ్రెండ్ కావడంతో… ఆ ఎఫెక్ట్ బీజేపీపైనా పడుతుందని అనుకున్నారట. అందుకే ఎన్నికలు అవగానే 5G, AI టెక్నాలజీ… అని… ఆ పేరు ఈ పేరు చెప్పి రిలయన్స్ జనంపై బాదుడు మొదలు పెట్టేసింది. జనం ఎక్కువగా రీఛార్జ్ చేయించుకునే 84 రోజులకు 666 రూపాయల ప్లాన్ మీద 20శాతం పెంచారు. దాంతో అది 799 రూపాయలకు చేరింది. ఛార్జీల మోతపై జియో నిర్ణయం తీసుకోగానే… ఎయిర్ టెల్ లాంటి ఇతర టెలికం నెట్ వర్క్స్ కూడా ఛార్జీల మోత మోగించేందుకు రెడీ అయ్యాయి.

ముఖేష్ కొడుకు అనంత్ అంబానీ పెళ్ళిని దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్ళిగా… గ్రాండ్ గా చేస్తున్నారు. అందుకోసం రెండు సార్లు ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఒక్కో పెళ్ళి కార్డు కోసం ఏకంగా ఆరున్నర లక్షల రూపాయలు ఖర్చుపెట్టారు. అనంత్ అంబానీ పెళ్ళికి 15 వందల కోట్ల దాకా ఖర్చవుతున్నట్టు తెలుస్తోంది. జామ్ నగర్ లో ప్రీవెడ్డింగ్ ఈవెంట్ కి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది ముఖేష్ ఫ్యామిలీ. ముంబై, లండన్, అబుదాబీలో పెళ్ళి వేడుకలు గ్రాండ్ గా చేయాలని చూస్తోంది. సరే… నీ దగ్గర డబ్బులున్నయ్… ఏమైనా చేసుకో బ్రో… కానీ సామాన్యుడి మీద ఇంత భారం ఎందుకని జనం ప్రశ్నిస్తున్నారు. నీ కొడుకు పెళ్ళికి అయ్యే ఖర్చును… జియో ఛార్జీలు పెంచి మా మీద వేస్తే ఎలా… అని నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. పెళ్ళికి పిలిచిన వాళ్ళకి ఆరున్నర లక్షల వెడ్డింగ్ కార్డు ఇచ్చావ్… ఇన్విటేషన్ లేని వాళ్ళ నుంచి జియో ఛార్జీల పేరుతో రిటన్ గిఫ్ట్ తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెళ్ళి ఖర్చే కాదు… హానీమూన్ ఖర్చు కూడా మేమే భరించాలా … అని ముఖేష్ అంబానీపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్స్.