MP Elections : ఎంపీ ఎన్నికలకు కమలం ఖతర్నాక్ ప్లాన్.. రంగంలోకి అమిత్ షా..
అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన సీట్లు రాకపోయినా.. గతంతో కంపేర్ చేస్తే బీజేపీ భారీగా బలం పుంజుకుంది. ఎప్పుడూ లేనట్లు.. 8 స్థానాల్లో విజయం సాధించింది. 19 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు భారీ పోటీ ఇచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన సీట్లు రాకపోయినా.. గతంతో కంపేర్ చేస్తే బీజేపీ భారీగా బలం పుంజుకుంది. ఎప్పుడూ లేనట్లు.. 8 స్థానాల్లో విజయం సాధించింది. 19 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు భారీ పోటీ ఇచ్చింది. 40కి పైగా స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కించుకుంది. దీంతో తెలంగాణలో పార్టీ బలపడేందుకు స్కోప్ ఉందని ఫిక్స్ అయిన బీజేపీ హైకమాండ్.. పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనేక వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. దీనికి సంబంధించి.. ఎప్పటికప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు ఆ పార్టీ పెద్దలు. పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా.. ఇప్పటినుంచి ఎన్నికలు ముగిసే వరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తెలంగాణ జనాలకు తెలిసే విధంగా విస్తృతంగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల కింద పార్టీ ఆఫీసులో సీనియర్ నేతలు, కార్యవర్గ సభ్యులంతా సమావేశమై చర్చించారు. వికసిత భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలను జనాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రచారం కోసం కమిటీలను వేయాలని నిర్ణయించుకున్నారు. సీనియర్ నేతల ఆధ్వర్యంలో ప్రతీ నియోజకవర్గంలో బస్సు యాత్రలతో పాటు.. సీనియర్ నేతలతో కమిటీలు వేసి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలలోను ప్రచారం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఐతే ఈసారి ఎన్నికల్లో మాత్రం డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధించాలని ఫోకస్ పెట్టింది. తెలంగాణ రాజకీయ పరిణామాలపై అమిత్ షా ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి.. ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడం ద్వారా… బ్యాలెన్స్ చేయాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే ముందుగానే బీజేపీ అలర్ట్ అయింది. తెలంగాణలో వ్యూహాలు అమలు చేస్తోంది