Delhi CM, Kejriwal : కేజ్రీవాల్‌పై మహిళా ఎంపీ సంచలణ ఆరోపణ
ఢిల్లీ సీఎం (Delhi CM) కేజ్రీవాల్ (Kejriwal) పై ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) మహిళ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణ చేశారు.
ఢిల్లీ సీఎం (Delhi CM) కేజ్రీవాల్ (Kejriwal) పై ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) మహిళ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణ చేశారు. కేజ్రీవాల్ తన పీఏ వైభవ్ చేత తనపై దాడి చేయించారని చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు స్వాతి. ఢిల్లీ సీఎం నివాసం షీష్ మహల్‌లోనే తనపై దాడి జరిగిందంటూ స్వాతి చెప్పడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ సీఎం నుంచి తనకు ఫోన్ వచ్చిందని.. ఆయనను కలిసేందుకే తాను షీష్ మహల్ ( Swati Maliwal) కు వెళ్లినట్టు స్వాతి చెప్పారు. కానీ అక్కడ కేజ్రీవాల్ పీఏ వైభవ్ తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశాడంటూ చెప్పారు.
తనను నాలుగైదుసార్లు కొట్టారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘనటా స్థలం నుంచే తాను రెండు సార్లు పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్‌కు కూడా ఫోన్ చేశానంటూ చెప్పారు. పోలీస్ రికార్డ్స్‌లో కూడా స్వాతి ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసినట్టు రికార్డ్ అయ్యింది. అయితే వాళ్లు షీష్ మహల్‌కు చేరుకునే సమయానికి స్వాతి అక్కడ లేరు. తరువాత పోలీస్ స్టేషన్‌కు నేరుగా వెళ్లి స్వాతి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కేజ్రీవాల్ మీద ఓ మహిళా ఎంపీ ఇలాంటి ఆరోపణ చేయడం బీజేపీ నేతలకు ఆయుధంగా మారినట్టయ్యింది. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరగాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఏకంగా సీఎం నివాసంలోనే మహిళా ఎంపీ మీద దాడి జరగడం.. ఆప్ ప్రభుత్వంలో మహిళకు ఉన్న గౌవరం, రక్షణను తెలియజేస్తున్నాయంటూ విమర్శలు చేస్తున్నారు. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన కారణంగానే స్వాతిపై ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఒక రాజ్యసభ మహిళా ఎంపీ సీఎం ఇంట్లో తనపై దాడి జరిగిందంటూ ఇలా ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంలచనంగా మారింది.