దీదీ.. నీకు పిల్లలుంటే.. తల్లి బాధ తెలిసేది..
కోల్‌కతా ట్రెయినీ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు నిరసనగా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయ్.

West Bengal Chief Minister Mamata Banerjee | Salil Bera
కోల్‌కతా ట్రెయినీ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు నిరసనగా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయ్. బుధవారం 12గంటల పాటు బెంగాల్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయ్. ఐతే ఈ నిరసనలపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై డాక్టర్ తల్లి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కన్నబిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న తమకు.. సీఎం వ్యాఖ్యలు బాధించాయని అన్నారు. ఆమెకు పిల్లలు లేరని,.. అందుకే ఆ బాధ దీదీకి తెలియదని.. పిల్లలుంటే తెలిసేది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయ్. తన కూతురుపై అఘాయిత్యానికి వ్యతిరేకంగా… వాళ్లంతా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని…నిందితులకు కఠిన శిక్ష పడేవరకు విద్యార్థులు వెనక్కి తగ్గరని.. కన్నబిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న తమకు.. దీదీ వ్యాఖ్యలు మరింత బాధ కలిగించాయంటూ డాక్టర్ తల్లి కన్నీటి పర్యంతం అయ్యారు. న్యాయం కోసం పోరాడుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళనకు మద్దతు ఇస్తున్నానని… కానీ, వారు వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నానని దీదీ కోరారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పోస్ట్ చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి పాస్‌పోర్ట్, వీసా కూడా దొరకదని రాసుకొచ్చారు. బెంగాల్‌లో అశాంతి చెలరేగితే ఈశాన్యం, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఢిల్లీలపైనా దాని ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆమె హెచ్చరించారు. ఈ మాటలు డాక్టర్ తల్లిని బాధపెట్టాయ్. న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. ఇందులోనూ క్రెడిట్ వెతుక్కోవడం ఏంటి అన్నట్లుగా దీదీపై విమర్శలు గుప్పించారు. పిల్లలు ఉంటే దీదీకి తల్లి బాధ తెలిసేది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.