Madhavilata VS Owaisi : మాధవీలతా మజాకా.. ఒవైసీ వణికిపోయాడుగా..
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) ఆసక్తి రేపుతున్నాయ్. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) ఆసక్తి రేపుతున్నాయ్. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఫిక్స్ అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. జనాల్లో తమ పట్టు తగ్గలేదని నిరూపించేందుకు బీఆర్ఎస్ సిద్ధం అయింది. దీంతో పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడూ లేనంత ఆసక్తిగా కనిపిస్తున్నాయ్. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకర్గాల్లో.. హైదరాబాద్ మీదే ఇప్పుడు అందరి కన్ను కనిపిస్తోంది. మాధవీలత దూకుడు, ప్రచార వ్యూహాలు.. ఇప్పుడు హైలైట్ ఆఫ్ ది ఎలక్షన్స్‌గా మారుతున్నాయ్.
హైదరాబాద్ బరిలో ఎంఐఎం (MIM) నుంచి ఓటమి ఎరుగని అసదుద్దీన్ ఒవైసీ (Owaisi) మరోసాగి దిగుతుండగా.. ఆయనపై బీజేపీ (BJP) నుంచి మాధవీలత పోటీ చేస్తున్నారు. మిగతా పార్టీల నేతలు ఉన్నా.. ఎంఐఎం వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారిపోయింది. ప్రచారం, క్యాంపెయిన్‌లో భాగంగా మాధవీలత చేస్తున్న కామెంట్లు, చర్యలు.. కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. మాధవీలతే కాదు.. ఆమె తరపున ప్రచారం చేసేందుకు అగ్రనేతలు వస్తుండటంతో.. అందరి దృష్టి హైదరాబాద్‌పైనే పడింది. ఇలాంటి పరిణామాల మధ్య.. ఎప్పుడూ చూడనిది, చూడలేం అనుకున్న సన్నివేశం ఒకటి.. హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో జరిగింది. మలక్‌పేట పరిధిలోని మూసారాంబాగ్, ఇందిరానగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఒవైసీకి.. స్థానికంగా ఉన్న కొందరు పురోహితులు మద్దతు తెలపటం ఆసక్తికరంగా మారింది.
ఓవైసీ చుట్టూ దాదాపు ముస్లింలే ఉండగా.. ముగ్గురు పురోహితులు అసదుద్దీన్ (Asaduddin) ను కలిసి.. ఆయనకు పూలమాల వేసి మద్దతు తెలిపారు. అందుకు సబంధించిన ఫొటోను అసదుద్దీనే స్వయంగా షేర్ చేశారు. మజ్లిస్ పార్టీ (Majlis Party) కి అండగా అన్ని మతాలవారు నిలబడ్డారంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఐతే ఇది నిజమేనా.. మార్ఫింగా అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం మాధవీలత భయపెట్టేసిందిగా అంటూ షేర్ చేస్తున్నారు. హిందువులు తన వైపే ఉన్నారని ఒవైసీ చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంటే.. మాధవీలత ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది అంటూ.. పోస్టులు పెడుతున్నారు.