TDP Alliance, Pawan Kalyan : పొలిటికల్ లీగ్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్! కూటమి గెలిచిందంటే.. పవన్ వల్లే..
ఈ ఒక్క మాట.. ఏపీ రాజకీయాన్ని మార్చేసింది. కొత్త రికార్డు క్రియేట్ చేసేలా చేసింది. గత ఎన్నికల్లో రెండుచోట్ల ఓడిపోయారు. పొలిటికల్ లైఫ్ మీద, వ్యక్తిగత జీవితం మీద.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఐతే ఏనాడు టార్గెట్ తప్పలేదు.
ఈ ఒక్క మాట.. ఏపీ రాజకీయాన్ని మార్చేసింది. కొత్త రికార్డు క్రియేట్ చేసేలా చేసింది. గత ఎన్నికల్లో రెండుచోట్ల ఓడిపోయారు. పొలిటికల్ లైఫ్ మీద, వ్యక్తిగత జీవితం మీద.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఐతే ఏనాడు టార్గెట్ తప్పలేదు. కొడతా అని చెప్పి మరీ కొట్టారు. కూటమిని గెలిపించారు పవన్. ఏపీ పొలిటికల్ లీగ్‌లో మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌గా మారారు. ఏపీలో జగన్ సర్కార్‌ను కూల్చడంలో.. పవన్ కీలకం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజం అయ్యాయ్. ఎవరూ ఊహించిన ఫలితాలు కనిపించాయ్ ఏపీలో. కూటమి ప్రభంజనం ముందు.. వైసీపీ నిలవలేకపోయింది.
కూటమి సునామీ క్రియేట్ చేసింది. ఐతే ఈ విజయం వెనక ఉన్న ఏకైక శక్తి, ఏకైక పవర్.. పవన్ కల్యాణ్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు.. అవసరం లేదు కూడా ! వైసీపీ ఓడిందన్నా.. కూటమి ప్రభంజనం క్రియేట్ చేసిందన్నా.. వన్ అండ్ ఓన్లీ రీజన్ పవన్ కల్యాణ్ అనేది ప్రతీ ఒక్కరు అంగీకరించాల్సి విషయం. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అన్నట్లు.. కూటమిని గెలిపించేందుకు, వైసీపీని కూల్చేందుకు.. చాలాసార్లు చాలా విషయాల్లో తగ్గారు పవన్. తగ్గిన ప్రతీసారి అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ తగ్గడం వెనక గొప్ప గెలుపు కోసం పవన్ ఆలోచలు ఉన్నాయని కాలానికి మాత్రమే తెలుసు. ఇప్పుడు అదే జరిగింది. నిజానికి టీడీపీ, జనసేన, బీజేపీ.. ఎవరికి వారు పోటీ చేయాలని ముందుగా డిసైడ్ అయ్యాయ్. ఐతే మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని పవన్ బలంగా నిలబడ్డారు.
ఓ దశలో పొత్తుకు బీజేపీకి ఇష్టంగా లేకపోయినా.. పవన్ ఢిల్లీ వెళ్లి.. అక్కడే మకాం వేసి మరీ.. కమలం పార్టీ పెద్దలను ఒప్పించారు. బీజేపీ, టీడీపీ, జనసేనను ఒక తాటిపైకి తీసుకువచ్చారు. ఓ దశలో పవన్‌పై టీడీపీ, బీజేపీతో పొత్తు కారణంగా విమర్శలు వచ్చాయ్. మరోసారి టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకొని.. పార్టీకి నష్టం కలిగిస్తున్నాడని కొందరు జనసేన కార్యకర్తలు కూడా విమర్శించారు. అటు అభిమానులు కూడా అలక పాన్పు ఎక్కారు. వారందరికీ పవన్ సర్ది చెప్పారు. పార్టీ కోసం… రాష్ట్రం కోసమే తాను పొత్తు పెట్టుకుంటున్నానని.. ఓ మెట్టు దిగి మరీ చెప్పారు. 21సీట్లలో పోటీకి దిగిన జనసేన.. ఓ దశలో అన్ని స్థానాల్లో లీడింగ్‌లో కనిపించింది.
ఇదంతా పవన్ పుణ్యమే. పదేళ్లుగా పదవి రాకపోయినా.. జనం గెలిపించకున్నా.. ఓపికతొ నిలబడ్డారు. రాజకీయాలకు భయపడి పారిపోలేదు. గెలుస్తా అన్నారు.. గెలిచారు.. ఓడిస్తా అన్నారు.. జగన్‌ను ఇంటికి పంపించారు. ఇదీ కదా చతురత అంటే.. ఇది కదా స్టామినా అంటే.. ఇది కదా ఫాలోయింగ్ అనే రేంజ్‌లో పవన్.. పొలిటికల్‌లో కొత్త క్రేజ్ క్రియేట్ చేశారు. ఒకటి మాత్రం నిజం.. కూటమి గెలిచింది అంటే.. అది కచ్చితంగా పవన్ కల్యాణ్ వల్లే ! నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ పొలిటికల్ లీగ్‌లో.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పవన్ కల్యాణే అనేది ప్రతీ ఒక్కరు అంగీకరించాల్సిన నిజం.